Telangana: బీఆర్ఎస్‌కు ఝలక్.. కాంగ్రెస్‌లోకి కీలక నేతలు..!
ABN, Publish Date - Feb 15 , 2024 | 09:00 PM
BRS Leaders to Join Congress Party: అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలంగాణ రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పొలిటికల్ సర్కిల్‌లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు బీఆర్ఎస్‌లో కీలక నేతలుగా చెలామణి అయిన వారు.. ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 15: అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలంగాణ రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) పార్టీ ఓడిపోవడం.. కాంగ్రెస్(Congress) అధికారంలోకి రావడంతో పొలిటికల్(Telangana Politics) సర్కిల్‌లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు బీఆర్ఎస్‌లో కీలక నేతలుగా చెలామణి అయిన వారు.. ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి.. కాంగ్రెస్‌లో చేరగా.. ఇప్పుడు మరికొందరు నేతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
తెలంగాణ ఏర్పాటు తరువాత హైదరాబాద్ నగర మొదటి మేయర్‌గా పని చేసిన బొంతు రామ్మోహన్.. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. రెండు రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆయన.. శుక్రవారం నాడు అంటే ఫిబ్రవరి 16వ తేదీన కాంగ్రెస్‌లో అధికారికంగా చేరనున్నారు. జీహెచ్ఎంసీ ప్రస్తుత డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత కూడా కాంగ్రెస్‌లో చేరనున్నారు. వీరితో పాటు.. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జెడ్పీ చైర్ పర్సన్ అనితా రెడ్డి, మరికొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గాంధీ భవన్‌లో పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో వీరంతా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Feb 15 , 2024 | 09:00 PM