ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: 2026 ఖేలో ఇండియా హైదరాబాద్‌లో

ABN, Publish Date - Nov 29 , 2024 | 03:34 AM

ఖేలో ఇండియా-2026 పోటీలకు హైదరాబాద్‌ వేదిక కాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. 2025లోనే నిర్వహించాలని సీఎం కోరగా, ఇప్పటికే బిహార్‌లో నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో 2026లో నిర్వహించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది.

  • సీఎం రేవంత్‌ వినతిపై కేంద్రం సానుకూలం

న్యూఢిల్లీ, నవంబర్‌28 (ఆంధ్రజ్యోతి): ఖేలో ఇండియా-2026 పోటీలకు హైదరాబాద్‌ వేదిక కాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. 2025లోనే నిర్వహించాలని సీఎం కోరగా, ఇప్పటికే బిహార్‌లో నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో 2026లో నిర్వహించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. రాష్ట్రంలో క్రీడల నిర్వహణకు ఉన్న సౌకర్యాలను వివరిస్తూ సీఎం రేవంత్‌ రాసిన లేఖను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌ రెడ్డితోపాటు ఎంపీలు మల్లు రవి, రామసహాయం రఘురామిరెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్‌ సింగ్‌ మాండవీయకు అందజేశారు.


  • కేంద్రానికి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

‘‘హైదరాబాద్‌ నగరంలో 32వ జాతీయ క్రీడలు (2002లో), ఆఫ్రో ఏషియన్‌ గేమ్స్‌, 7వ మిలిటరీ గేమ్స్‌ సహా అనేక జాతీయ స్థాయి పోటీలు జరిగాయి. రాష్ట్రంలో క్రీడా రంగానికి గత పదేండ్ల పాలనతో పోలిేస్త ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. జాతీయ స్థాయి పోటీలను నిర్వహించడానికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్సులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇండోర్‌ ేస్టడియం, స్విమ్మింగ్‌ పూల్‌, సింథటిక్‌ అథ్లెటిక్‌ ట్రాక్‌, హాకీ టర్ఫ్‌, షూటింగ్‌ రేంజ్‌, సరూర్‌నగర్‌లో మల్టీపర్పస్‌ ఇండోర్‌ ేస్టడియం, సింథటిక్‌ టెన్నిస్‌ కోర్ట్‌, ేస్కటింగ్‌ ట్రాక్‌, ఔట్‌ డోర్‌ ేస్టడియం, ఎల్బీ ేస్టడియంలో ఇండోర్‌ ేస్టడియంతోపాటు టెన్నక్‌ కాంప్లెక్స్‌, ఫుట్‌ బాల్‌ గ్రౌండ్‌, కేవీబీఆర్‌ ఇండోర్‌ ేస్టడియం, హుేస్సన్‌ సాగర్‌లో వాటర్‌ స్పోర్ట్స్‌ నిర్వహించే సౌకర్యం, ఉస్మానియా క్యాంప్‌సలో సైక్లింగ్‌ వెల్‌డ్రోమ్‌, సింథటిక్‌ అథ్లెటిక్‌ ట్రాక్‌, స్విమ్మింగ్‌ పూల్‌, ేస్కటింగ్‌ ట్రాక్‌, జింఖానా-2 గ్రౌండ్‌లో ఫుట్‌ బాల్‌ గ్రౌండ్‌తో పాటు ఔట్‌ డోర్‌ గేమ్స్‌ నిర్వహించే వసతులు ఉన్నాయి. గతేడాదితో పోలిేస్త ఈసారి బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం పది రెట్ల మేర క్రీడల కోసం కేటాయింపులను పెంచింది. కేవలం క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు మాత్రమే కాకుండా క్రీడాకారులు చేరుకునేలా రైలు, విమాన సౌకర్యాలు కూడా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం మాత్రమే కాకుండా యువతను ప్రోత్సహించేలా ప్రత్యేక పాలసీని కూడా రూపొందిస్తున్నది.‘‘ అని కేంద్రానికి రాసిన లేఖలో సీఎం రేవంత్‌రెడ్డి స్పషం చేశారు. సీఎం వినతిపై కేంద్ర క్రీడల మంత్రి మాండవీయ సానుకూలంగా స్పందించారని, 2026లో హైదరాబాద్‌లో పోటీలు నిర్వహించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు జితేందర్‌ రెడ్డి తెలిపారు.

Updated Date - Nov 29 , 2024 | 03:34 AM