Hyderabad: బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ పీఎస్‌కు...
ABN, Publish Date - May 21 , 2024 | 10:10 AM
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్(Phone tapping) వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్(Banjara Hills Police Station) పరిధిలో కొనసాగిన ఫోన్‌ట్యాపింగ్ కేసు విచారణ ఇక నుంచి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్(Jubilee Hills Police Station)లో జరగనుంది.
- ఫోన్‌ట్యాపింగ్ కేసు విచారణ బదిలీ
హైదరాబాద్ సిటీ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్(Phone tapping) వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్(Banjara Hills Police Station) పరిధిలో కొనసాగిన ఫోన్‌ట్యాపింగ్ కేసు విచారణ ఇక నుంచి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్(Jubilee Hills Police Station)లో జరగనుంది. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా జూబ్లీహిల్స్ ఏసీపీ వి.వెంకటగిరి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే పోలీస్‌స్టేషన్ మార్పునకు అధికారులు స్పష్టమైన కారణాలు చెప్పనప్పటికీ ఇప్పటికే కేసు విచారణ ఓ కొలిక్కి రావడంతో మిగిలిన దర్యాప్తు వ్యవహారాలన్నీ జూబ్లీహిల్స్‌లోని తన కార్యాలయం నుంచే చూసుకునే విధంగా ఏసీపీ కోరినట్లు తెలిసింది.
ఇదికూడా చదవండి: ఐదు రోజుల్లో నాలుగు చోరీలు.. నగరంలో దోపిడీ దొంగలు
అంతేకాకుండా విచారణలో భాగంగా తరచూ జూబ్లీహిల్స్ నుంచి బంజారాహిల్స్‌కు వెళ్లి రావడంతో పాలనాపరమైన ఇబ్బందులు సైతం ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్‌కు మార్చినట్లు తెలుస్తోంది. ఇటీవల పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇకపై ఈ కేసులో అధికారులు దూకుడు పెంచనున్నట్లు తెలిసింది. త్వరలోనే మరికొంతమందిని అదుపులోకి తీసుకొని విచారించనున్నట్లు సమాచారం.
ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్ రోజున.. తగ్గిన పొల్యూషన్
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - May 21 , 2024 | 10:10 AM