ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kaleshwaram Project: సరస్వతి బ్యారేజీలో భూ భౌతిక పరీక్షలు

ABN, Publish Date - Dec 30 , 2024 | 05:06 AM

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని సరస్వతి బ్యారేజీలో ఆదివారం భూ భౌతిక పరీక్షలు(జియో ఫిజికల్‌ టెస్టులు) ప్రారంభమయ్యాయి.

మహదేవపూర్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని సరస్వతి బ్యారేజీలో ఆదివారం భూ భౌతిక పరీక్షలు(జియో ఫిజికల్‌ టెస్టులు) ప్రారంభమయ్యాయి. బ్యారేజీలో లీకులు సంభవించిన నేపథ్యంలో భూమి స్వభావాన్ని తెలుసుకొనేందుకు మూడు నెలల క్రితం ఒకటి, రెండో విడత భూ భౌతిక పరీక్షలు జరిగాయి. భారీ వర్షాల కారణంగా మూడో విడత పరీక్షలను నిర్వహించలేకపోయారు. ఈ క్రమంలో ఆదివారం వాటిని చేపట్టారు. నలుగురు శాస్త్రవేత్తలు సరస్వతి బ్యారేజీ వద్దకు చేరుకొని మూడో విడత భూ భౌతిక పరీక్షలు ప్రారంభించారు. మూడు రోజులపాటు ఇవి జరగనున్నట్టు శాస్త్రవేత్తలు ధనంజయ్‌ నాయుడు, వివేక్‌, ప్రశాంత్‌ సింగ్‌ సవాంగ్‌ తెలిపారు.

Updated Date - Dec 30 , 2024 | 05:06 AM