ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhatti: ఇబ్బందులున్నా వెనక్కుతగ్గం రైతు భరోసా అందజేస్తాం: భట్టి

ABN, Publish Date - Dec 30 , 2024 | 03:21 AM

ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా.. ప్రజా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేందుకు కట్టుబడి ఉందని రైతు భరోసాపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్‌, డిప్యూటీ సీఎం భట్టి అన్నారు.

హైదరాబాద్‌, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా.. ప్రజా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేందుకు కట్టుబడి ఉందని రైతు భరోసాపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్‌, డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ఈ విషయంలో ఇచ్చిన మాట మేరకు ముందుకెళ్తామని స్పష్టం చేశారు. తాము వచ్చాక తొలి ఏడాదిలోనే యాసంగి పంటకు పెట్టుబడి సాయంగా 1.57 కోట్ల ఎకరాలకు రూ.7,625 కోట్లను జమ చేసినట్లు భట్టి గుర్తు చేశారు. బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.72,659 కోట్లు కేటాయించామని.. రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ఈ అంకెలు తెలియజేస్తాయని పేర్కొన్నారు. రెండు లక్షల వరకు రుణ మాఫీ కింద రెండు నెలల వ్యవధిలోనే రూ.21 వేల కోట్లను రైతుల ఖాతాల్లో వేసినట్లు తెలిపారు.


వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేలా, రైతుల సంక్షేమానికి కృషి చేేసందుకు వ్యవసాయ కమిషన్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతు వేదికలను పూర్తిగా వినియోగంలోకి తెచ్చేందుకు, ఆధునికీకరించేందుకు ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. 110 రైతు వేదికల్లో రూ.4 కోట్లకు పైగా వెచ్చించి వీడియో కాన్ఫరెన్స్‌ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రకృతి విపత్తుల బారి నుంచి రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని భట్టి అన్నారు. పంటల బీమా ప్రీమియం మొత్తా న్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. తద్వారా పంటకే కాదు రైతు కుటుంబానికీ భరోసాగా నిలుస్తున్నట్లు వివరించారు.

Updated Date - Dec 30 , 2024 | 03:21 AM