దివ్యాంగ విద్యార్థులు సాధారణ పిల్లలతో సమానంగా రాణించాలి
ABN, Publish Date - Dec 03 , 2024 | 11:04 PM
దివ్యాంగ విద్యార్థులు సాధారణ పిల్లలతో సమానంగా రాణించాలని డీఈవో యాదయ్య అన్నారు. మంగళ వారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భం గా భవితా కేంద్రంలో నిర్వహించిన దివ్యాంగ దినోత్సవ వేడుకల్లో మాట్లాడారు. ప్రతీ వ్యక్తి లక్ష్యసాధనకు చదు వు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
మంచిర్యాల అర్బన్, డిసెంబర్ 3 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగ విద్యార్థులు సాధారణ పిల్లలతో సమానంగా రాణించాలని డీఈవో యాదయ్య అన్నారు. మంగళ వారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భం గా భవితా కేంద్రంలో నిర్వహించిన దివ్యాంగ దినోత్సవ వేడుకల్లో మాట్లాడారు. ప్రతీ వ్యక్తి లక్ష్యసాధనకు చదు వు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దివ్యాంగ పిల్లల కోసం ప్రభుత్వం ఎన్నో రకాలుగా ప్రోత్సహిస్తుం దని, వాటన్నింటిని సద్వినియోగం చేసుకుంటూ సాధా రణ పౌరులతో సమానంగా ఎదగాలన్నారు. అనంతరం సమ్మిళిత విద్య కోఆర్డినేటర్ చౌదరి మాట్లాడుతూ దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు అందజేస్తా రని, రెగ్యులర్ పాఠశాలలకు వెళ్లే వారికి రవాణా, ఎస్కార్ట్ అలవెన్సు, బాలికలకు స్టైఫండ్ సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఆటల పోటీల విజేతలకు బహుమతు లను అందజేశారు. మండల విద్యాధికారి మాలవీదేవి, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు పద్మజ, ఈఆర్‌పీ లు సృజన, శ్రీలత పాల్గొన్నారు.
మందమర్రిటౌన్, (ఆంధ్రజ్యోతి): మానసిక దివ్యాం గులకు మనోధైర్యం కల్పిస్తూ వారిని ప్రోత్సహించాలని జీఎం దేవేందర్ తెలిపారు. మనోవికాస్ మానసిక దివ్యాంగుల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం పాఠశాల అభి వృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి చేయూతనందిస్తుం దన్నారు. ఆయా స్టేషనరీలను విద్యార్థులు తయారు చేస్తూ పాఠశాల ఆర్థిక ప్రగతికి తోడ్పడుతున్నారన్నారు. ఆటల పోటీల్లో గెలిచిన వారికి జీఎం బహుమతులు అందించారు. సలేంద్ర సత్యనారాయణ, శ్యాంసుందర్, ఆసిఫ్, సురేఖ, రాజలింగు పాల్గొన్నారు.
Updated Date - Dec 03 , 2024 | 11:04 PM