ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లగచర్ల బాధితులకు న్యాయం చేయాలి

ABN, Publish Date - Dec 17 , 2024 | 10:43 PM

లగచర్ల బాధితులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. కొడంగల్‌లో రైతన్నలపై అక్రమ కేసులు బనాయించడం, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం, జైల్లో నిర్బంధించడాన్ని నిరసిస్తూ ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహా నికి వినతిపత్రం అందించారు.

గర్మిళ్ల, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): లగచర్ల బాధితులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. కొడంగల్‌లో రైతన్నలపై అక్రమ కేసులు బనాయించడం, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం, జైల్లో నిర్బంధించడాన్ని నిరసిస్తూ ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహా నికి వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ, పేద దళిత, గిరిజనులు ఎన్నో తరాలుగా భూములు సాగు చేసుకుంటుంటే వారి నుంచి భూములు లాక్కొని హింసించడం, జైలుకు పంపడం తగదన్నారు. రైతులను వెంటనే విడుదల చేసి, వారిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. లక్షెట్టిపేట మున్సిపల్‌ చైర్మన్‌ నల్మాస్‌ కాంతయ్య, పార్టీ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, మున్సిపల్‌ ఫ్లోర్‌లీ డర్‌ అంకం నరేష్‌, నాయకులు రవీందర్‌ రెడ్డి, మల్లేష్‌, రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

మందమర్రి టౌన్‌, (ఆంద్రజ్యోతి): రాష్ట్రంలో రైతులపై దాడులు, అరాచకాలు పెరిగిపోయా యని బీఆర్‌ఎస్‌ నాయకులు మండిపడ్డారు. అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన తెలిపారు. బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జె రవిందర్‌, రాజారమేష్‌, మేడిపెల్లి సంపత్‌లు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతులపై పోలీసులతో ఉక్కుపాదం మోపుతున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం కాలరాస్తున్నార న్నారు. పేదలు సాగు చేసుకుంటున్న భూము లను తీసుకొని రోడ్డున పడేసే కుట్రలు జరుగుతు న్నాయన్నారు. రాజశేఖర్‌, బడికెల సంపత్‌, ఎండి అబ్బాస్‌, తోట సురేందర్‌, బర్ల సదానం దం, బోరిగం వెంకటేష్‌, రాయనర్సు పాల్గొన్నారు.

నెన్నెల, (ఆంధ్రజ్యోతి): లగచర్లలో రైతుల అక్రమ అరెస్టులను బీఆర్‌ఎస్‌ నాయకులు ఖం డించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్ర హానికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భం గా నాయకులు మాట్లాడారు. రైతులపై అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. రైతులను జైళ్లలో పెట్టడం హేయమైన చర్య అన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు విద్యా సాగర్‌గౌడ్‌, నాయకులు ఎండీ ఇబ్రహీం, ప్రతాప్‌రెడ్డి, మసూద్‌ఖాన్‌, షాకిర్‌, ప్రవీణ్‌ అుణ్‌సింగ్‌, దురిశెట్టి రవీందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2024 | 10:43 PM