కలెక్టరేట్ ఎదుట ముగిసిన ఎస్‌ఎస్‌ఏల దీక్ష
ABN, Publish Date - Dec 09 , 2024 | 11:03 PM
నస్పూర్‌లోని కలెక్టరేట్ ఎదుట తెలంగాణ సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సంఘం (ఎస్‌ఎస్‌ఏ-జెఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష సోమవారం ముగిసింది. ప్రభుత్వం నుంచి సానుకూలత రాకపోవడంతో మంగళవారం నుంచి సమ్మెలోకి వెళ్ళాలని నిర్ణయించారు.
నస్పూర్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): నస్పూర్‌లోని కలెక్టరేట్ ఎదుట తెలంగాణ సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సంఘం (ఎస్‌ఎస్‌ఏ-జెఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష సోమవారం ముగిసింది. ప్రభుత్వం నుంచి సానుకూలత రాకపోవడంతో మంగళవారం నుంచి సమ్మెలోకి వెళ్ళాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు సుమలత, కార్యదర్శి రాజన్నలు మాట్లాడుతూ నాలుగు రోజులుగా దీక్ష చేపట్టినట్లు తెలిపారు.
రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం క్రమబద్దీకరణ చేయాలన్నారు. న్యాయం జరిగే వరకు ఉద్యమం ఆపేదిలేదని స్పష్టం చేశారు. ఆర్గనైజింగ్ కార్యదర్శి సుమన, కార్యదర్శి దేవేంద్ర, నాయకులు జనార్దన్, నగేష్, కవిత, ఫణిబాల, కనకలక్ష్మి, కవిత, మూర్తి, రాకేష్, శ్రీధర్, ముఖేష్, రాంబాబు, ప్రణీత్ పాల్గొన్నారు. దీక్షకు ఐఎఫ్‌టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మనందం, పీడీఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, నాయకులు మల్లన్న, దారిశెట్టి అరుణలు మద్దతు తెలిపారు.
Updated Date - Dec 09 , 2024 | 11:03 PM