క్రీడలతో ఆరోగ్యం, ఉల్లాసం
ABN, Publish Date - Dec 17 , 2024 | 10:41 PM
క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం కలుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సీఎం కప్-2024 క్రీడలను అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా యువజనుల క్రీడాశాఖ అధికారి కీర్తి రాజ్‌వీరుతో కలిసి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం ఆయన ప్రారంభించారు.
మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం కలుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సీఎం కప్-2024 క్రీడలను అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా యువజనుల క్రీడాశాఖ అధికారి కీర్తి రాజ్‌వీరుతో కలిసి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం ఆయన ప్రారంభించారు.
ఈ నెల 21వ తేదీ వరకు క్రీడా పోటీలు ఉంటాయని, ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. అనంతరం ఆయన షెడ్యుల్డ్ కులాల వసతి గృహాన్ని సందర్శించి, విద్యార్థుల గదులు, వంటశాల, భోజనం నాణ్యతను పరిశీ లించారు. ఈ నెల 14న డైట్ చార్జీలను 40శాతం, కాస్మొటిక్ చార్జీలను 200 శాతం పెంచినట్లు చెప్పారు. నూతన మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు యాదయ్య, దుర్గా ప్రసాద్, రవీందర్ రెడ్డి, పురుషోత్తం నాయక్, రాజేశ్వరి, రౌఫ్‌ఖాన్, సంతోష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 17 , 2024 | 10:41 PM