బీజేపీ దిష్టిబొమ్మ దహనం
ABN, Publish Date - Nov 26 , 2024 | 10:23 PM
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో వామపక్ష కార్మిక సంఘాలు, రైతు సంఘాల నాయకులు బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
మంచిర్యాల కలెక్టరేట్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో వామపక్ష కార్మిక సంఘాలు, రైతు సంఘాల నాయకులు బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహజ సంపదలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పేందుకు కుట్రలు చేస్తోందన్నారు. కార్మిక చట్టాల సవరణ చేస్తూ కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తోందన్నారు. కార్పొరేట్‌ల చేతిలో ప్రధాని మోదీ కీలు బొమ్మగా మారారన్నారు. నాయకులు చంద్రమాణిక్యం, దుంపల రంజిత్, లాల్‌కుమార్, బ్రహ్మానందం, దేవరాజ్, కలీందర్‌ఆలీఖాన్, బానేష్, ప్రకాష్, మంగ, రమాదేవి పాల్గొన్నారు.
Updated Date - Nov 26 , 2024 | 10:23 PM