ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉపాధి కోల్పోతున్నామని ఆటోల బంద్‌

ABN, Publish Date - Dec 07 , 2024 | 10:44 PM

ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత ప్రయాణం పథకంతో తాము ఉపాధి కోల్పోతున్నామని ఆటో యూనియన్‌ జేఏసీ అధ్యక్షుడు కట్ట రామ్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం నియోజకవర్గంలో ఆటోల బంద్‌ పాటించారు. ఆయన మాట్లాడుతూ మహిళలకు ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆటోలకు గిరాకీ లేకుండా పోయిందని తెలిపారు.

బెల్లంపల్లి, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత ప్రయాణం పథకంతో తాము ఉపాధి కోల్పోతున్నామని ఆటో యూనియన్‌ జేఏసీ అధ్యక్షుడు కట్ట రామ్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం నియోజకవర్గంలో ఆటోల బంద్‌ పాటించారు. ఆయన మాట్లాడుతూ మహిళలకు ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆటోలకు గిరాకీ లేకుండా పోయిందని తెలిపారు. ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఆటో డ్రైవ ర్లను ప్రభుత్వం ఆదుకోవాలని, సంవత్సరానికి రూ. 15 వేలు అందించాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఆటో యూనియన్‌ నాయకులు రాజం, శ్రీనివాస్‌, సతీష్‌, అఖిల్‌, సమ్మయ్య, గోపి, మల్లేష్‌, కిశోర్‌, రాంచందర్‌, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

దండేపల్లి, (ఆంధ్రజ్యోతి): మహాలక్ష్మి పధకం ద్వారా మహిళలకు ఆర్టీసి బస్సులో ఉచిత ప్రయాణంతో ఆటో లకు గిరాకీ తగ్గిందని, ప్రభుత్వం ఆదుకోవాలని మండ లంలోని ఆటో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆటో యజమా నులు, డ్రైవర్స్‌ ఆటోల బంద్‌ చేపట్టారు. తాళ్ళపేటలో ఆందోళన చేశారు.

Updated Date - Dec 07 , 2024 | 10:44 PM