దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
ABN, Publish Date - Nov 25 , 2024 | 10:30 PM
ప్రజావాణి దరఖాస్తులను అధికారులు సమన్వయంతో త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ మోతిలాల్, ఆర్డీవోలు శ్రీనివాస రావు, హరికృష్ణతో కలిసి ఆర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
మంచిర్యాల కలెక్టరేట్, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ప్రజావాణి దరఖాస్తులను అధికారులు సమన్వయంతో త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ మోతిలాల్, ఆర్డీవోలు శ్రీనివాస రావు, హరికృష్ణతో కలిసి ఆర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. లక్షెట్టిపేట, జన్నారం, కాసి పేట, మంచిర్యాల, మందమర్రి, కోటపల్లి, గర్మిళ్ల, చెన్నూరు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు దర ఖాస్తులు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా వాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి పరిష్క రించేందుకు చర్యలు తీసుకొంటామన్నారు.
తక్కువ వయసు వారు ఓటర్లుగా నమోదు
చెన్నూరు, (ఆంధ్రజ్యోతి): దుగ్నేపల్లిలో తక్కువ వయస్సు ఉన్న వారిని ఓటర్లుగా నమోదు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో రమేష్ రెడ్డి, తిరుపతిరెడ్డి, ప్రకాష్‌రెడ్డిలు ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. వారి వయస్సును నిర్ధారణ చేసి ఓటరు జాబితా నుంచి తొలగించాలని, దీనిపై విచారణ చేసి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Updated Date - Nov 25 , 2024 | 10:30 PM