IPL 2024: కోచ్‌తో కలిసి ప్లేయర్ డ్యాన్స్.. వీడియో అదిరిపోయిందిగా..
ABN, Publish Date - Mar 21 , 2024 | 01:30 PM
ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. క్రికెట్ అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్న ఐపీఎల్ క్రికెట్ పండుగకు శుక్రవారం నాడు చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.
ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. క్రికెట్ అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్న ఐపీఎల్ క్రికెట్ పండుగకు శుక్రవారం నాడు చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. టోర్నీ ప్రారంభానికి ముందు ఎప్పటిలాగే ఈ సారి కూడా ప్రారంభ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు ఆడిపాడనున్నారు. మరోవైపు అన్ని జట్లు కూడా ఐపీఎల్‌కు సిద్ధమయ్యాయి. ఆటగాళ్లంతా ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. నిత్యం క్రికెట్‌తో గడిపే ఆటగాళ్లు అప్పుడప్పుడు డ్యాన్సులు చేస్తూ రీఫ్రెష్ అవుతుంటారు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలను కూడా మనం ఇది వరకే సోషల్ మీడియాలో చూశాం. తాజాగా అలాంటిదే మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్‌తో కలిసి ఆ జట్టు యువ ఆటగాడు రింకూ సింగ్ డ్యాన్స్ చేశాడు. వీరిద్దరు కలిసి చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంటోంది. వీరిద్దరు డ్యాన్స్ చేస్తుండగా ఇతర ఆటగాళ్లు ఎంకరేజ్ చేయడం కూడా ఆ వీడియోలో గమనించవచ్చు. ఈ వీడియోను కోల్‌కతానైట్ రైడర్స్ యాజమాన్యం తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. క్రికెట్‌లో కోచ్, ప్లేయర్ కలిసి డ్యాన్స్ చేసిన వీడియో బయటికి రావడం బహుషా ఇదే మొదటిసారి కావొచ్చు. కాగా ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తమ తొలి మ్యాచ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది. ఈ నెల 23న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. గాయం కారణంగా గత సీజన్‌కు దూరంగా ఉన్న కోల్‌కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఈ సారి బరిలోకి దిగుతున్నాడు. అలాగే కెప్టెన్‌గా కేకేఆర్‌కు రెండు ఐపీఎల్ ట్రోపీలు అందించిన గౌతం గంభీర్ ఈ సారి మెంటార్‌గా వ్యవహరించనుండడం గమనార్హం.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు:
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, అనుకుల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కేఎస్ భరత్, చేతన్ స్టార్క్ సకారియా, అంగ్క్రిష్ రఘువంశీ, రమణదీప్ సింగ్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ముజీబ్ ఉర్ రెహమాన్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Mar 21 , 2024 | 01:31 PM