ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BCCI: శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు షాక్ ఇవ్వనున్న బీసీసీఐ?

ABN, Publish Date - Feb 23 , 2024 | 04:51 PM

టీమిండియా యువ ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు బీసీసీఐ షాక్ ఇవ్వబోతుందా?.. త్వరలో వారి సెంట్రల్ కాంట్రాక్టులను రద్దు చేయబోతుందా?.. అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.

టీమిండియా యువ ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు బీసీసీఐ షాక్ ఇవ్వబోతుందా?.. త్వరలో వారి సెంట్రల్ కాంట్రాక్టులను రద్దు చేయబోతుందా?.. అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తమ ఆదేశాలను బేఖాతరు చేసి రంజీ ట్రోఫీకి దూరంగా ఉన్న శ్రేయాస్, కిషన్‌పై చర్యలు తీసుకోవడానికి బోర్డు సిద్దమైందని సమాచారం. ఈ క్రమంలోనే త్వరలోనే 2024-2025 ఏడాదికిగాను ప్రకటించనున్న సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి వీరిద్దరిని తొలగించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు పలు జాతీయ క్రీడా వెబ్‌సైట్స్ తమ వార్తా కథనాల్లో పేర్కొన్నాయి. కాగా 2022-2023 సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకారం శ్రేయాస్ అయ్యర్ బీ కేటగిరీలో, ఇషాన్ కిషన్ సీ కేటగిరిలో ఉన్నారు. ఇందుకుగాను గతేడాది అయ్యర్‌కు రూ.3 కోట్లు, కిషన్‌కు ఒక కోటి రూపాయలు లభించాయి. అసలు ఏం జరిగిందంటే.. ఒక వైపు ఫేలవ ఫామ్, మరోవైపు వెన్నునొప్పి సమస్యతో ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు ప్రకటించిన టీమిండియాలో శ్రేయాస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు.


దీంతో వెన్నునొప్పి సాకుతో శ్రేయాస్ అయ్యర్ ఏన్సీఏలో చేరాడు. అయితే బీసీసీఐ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని ఇటీవల బీసీసీఐ కార్యదర్శి జైషా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ముంబై క్రికెట్ అసోసియేషన్ అతడిని రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఆడాలని కోరింది. కానీ అయ్యర్ మాత్రం వెన్నునొప్పిని సాకుగా చూపి బరిలోకి దిగలేదు. అయితే అంతకు ఒకరోజు ముందే అయ్యర్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నట్టు ఏన్సీఏ సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో అయ్యర్ కావాలనే రంజీలకు దూరంగా ఉన్నాడని బోర్డు సిరీయస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇషాన్ కిషన్‌ది కూడా ఇదే తీరు. మానసిక సమస్యల సాకుతో సౌతాఫ్రికా పర్యటన నుంచి జట్టుకు దూరంగా ఉంటున్నాడు. రంజీలో ఆడాలని ఆదేశించిన పట్టించుకోవడం లేదు. పైగా రంజీలను పక్కన పెట్టి ఐపీఎల్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌ కాంట్రాక్టులను రద్దు చేసేందుకు బీసీసీఐ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా బీసీసీఐ 2024-2025కు సంబంధించి ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను ప్రకటిస్తే కానీ ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశాలు లేవు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 23 , 2024 | 04:51 PM

Advertising
Advertising