ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: ఆ రోజు ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్లతో బీసీసీఐ సమావేశం.. ఆ విషయాలపై చర్చ

ABN, Publish Date - Apr 01 , 2024 | 04:38 PM

ఈ నెల 16న ఐపీఎల్‌లోని 10 ఫ్రాంచైజీల యజమానులతో బీసీసీఐ సమావేశం కానుంది. ఈ సమావేశంలో లీగ్‌లో పలు ముఖ్యమైన సమస్యలను చర్చించనున్నారు. అహ్మదాబాద్ వేదికగా ఈ సమావేశం జరగనుందని సమాచారం. ఈ సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జైషా, ఐపీఎల్ చైర్‌పర్సన్ అరుణ్ ధుమాల్ పాల్గొననున్నారు.

అహ్మదాబాద్: ఈ నెల 16న ఐపీఎల్‌లోని(IPL) 10 ఫ్రాంచైజీల యజమానులతో బీసీసీఐ(BCCI) సమావేశం కానుంది. ఈ సమావేశంలో లీగ్‌లోని పలు ముఖ్యమైన సమస్యలను చర్చించనున్నారు. అహ్మదాబాద్ వేదికగా ఈ సమావేశం జరగనుందని సమాచారం. ఈ సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జైషా, ఐపీఎల్ చైర్‌పర్సన్ అరుణ్ ధుమాల్ పాల్గొననున్నారు. అయితే బీసీసీఐ ప్రాంచైజీల యజమానులను మాత్రమే ఆహ్వానించినప్పటికీ జట్ల సీఈఓలు, కార్యచరణ బృందాలు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ క్రిక్ బజ్ తమ కథనంలో పేర్కొంది. క్రిక్ బజ్ కథనం ప్రకారం.. ఫ్రాంచైజీల యజమానులతో బీసీసీఐ జరిపే సమావేశంలో అనేక అంశాలపై చర్చించనున్నారు.

IPL 2024: ఐపీఎల్‌లో ఆ రోజు జరగాల్సిన బిగ్ మ్యాచ్‌పై నీలి నీడలు.. ఎందుకంటే..


అనేక సమస్యలతోపాటు వచ్చే ఏడాది నిర్వహించనున్న ఐపీఎల్ 2025 మెగా వేలం గురించి కూడా చర్చించనున్నారని సమాచారం. ప్లేయర్ల రిటెన్షన్ జాబితా గురించి చర్చ జరగనుంది. ఇప్పటివరకు మెగా వేలానికి ముందు ప్రతి జట్టు నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అందులో ముగ్గురు భారత ఆటగాళ్లు, ఒక విదేశీ ఆటగాడు లేదా ఇద్దరేసి చొప్పున భారత, విదేశీ ఆటగాళ్లు ఉండాలి. అయితే ఈ సంఖ్యను 8కి పెంచాలని పలువురు కోరుతున్నారు. మరోవైపు దీనిని కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న జట్ల పర్స్ వాల్యూను కూడా పెంచాలని పలువురు కోరుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం లీగ్‌లో ప్రతి జట్టు పర్సు వాల్యూ రూ.100 కోట్లుగా ఉంది. నిబంధనల ప్రకారం ప్రతి జట్టు ఇందులో కనీసం 75 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ అంశాలన్నింటిపై ఏప్రిల్ 16 స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL 2024: గంభీర్-కోహ్లీకి ఆస్కార్ ఇవ్వాలి.. దిగ్గజ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు

IPL 2024: ముంబైతో మ్యాచ్‌లో చరిత్ర సృష్టించనున్న అశ్విన్.. ఆ రికార్డు సాధించిన తొలి బౌలర్‌గా..

Updated Date - Apr 01 , 2024 | 06:14 PM

Advertising
Advertising