Viral: రోజుకో ప్యాకెట్.. 30 ఏళ్లు పాటు ధూమపానం! బొగ్గులా మారిన ఊపిరితిత్తులు!
ABN, Publish Date - Jun 28 , 2024 | 09:13 PM
రోజుకో సిగరెట్ ప్యాకెట్ చొప్పున 30 ఊళ్లా పాటు ధూమపానం చేసిన ఓ వ్యక్తి ఊపిరితిత్తులు బొగ్గులా మారిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ధూమపానం ఎంతటి ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అలవాటు ఉన్నవాళ్లు దీర్ఘకాలంలో క్యాన్సర్ వ్యాధి బారినపడతారు. అందుకే సిగరెట్ ప్యాకెట్‌పై నోటి క్యాన్సర్‌కు సంబంధించిన ఫొటోలు ఉంటాయి. అయినా కూడా అనేక మంది ఇప్పటికీ సిగరెట్ తాగడం మానలేకపోతున్నారు. చేజేతులా మృత్యువును ఆహ్వానిస్తారు. అలాంటి వాళ్లకు కనువిప్పు కలిగించి రాబోయే ముప్పును చూపించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ వ్యక్తి దాదాపు 30 ఏళ్ల పాటు రోజుకు ఒక ప్యాకెట్ చొప్పున సిగరెట్ తాగి చివరకు మరణించాడు. అతడి ఊపిరితిత్తులను బయటకు తీసి చూసిన వైద్యులే ఆశ్చర్యపోయారు. నిరంతర ధూమపానం కారణంగా ఊపిరితిత్తులన్నీ బొగ్గులాగా నల్లగా మారిపోయాయి. గుర్తుపట్టలేనంగా తయారయ్యాయి (smoking a pack a day for 30 years turned lungs black in viral Video).
Viral: సుధామూర్తి చెప్పిన జీవిత సత్యం! యువత పెళ్లికి ముందే ఇది తెలుసుకోవాలి!
కాగా, వీడియోను చూసిన నెటిజన్లు కూడా షాకైపోతున్నారు. ధూమపానంతో ఇంతటి ప్రమాదమా అంటూ నోరెళ్లబెట్టారు. ఇలాంటి అలవాట్లు దూరంగా ఉండటమే మంచిదని అనేక మంది కామెంట్ చేశారు. అయితే, ధూమపానం అలవాటు మానగానే ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగవడం ప్రారంభిస్తుందని ఓ వ్యక్తి నెట్టింట పోస్టు పెట్టాడు. పొగతాగే అలవాటు ఏ స్థాయిలో ఉందన్న దాన్నిబట్టి ఈ అలవాటు మానేసిన ఏడాదికల్లా ఆయాసం తగ్గిపోతుందని అన్నాడు.
ఇదే పంథాను కొనసాగిస్తే ఐదు నుంచి పదేళ్ల కల్లా నోరు, గొంతు క్యాన్సర్ బారినపడే అవకాశాలు సగానికి తగ్గిపోతాయని అన్నారు. ఊపిరితిత్తులు క్యాన్సర్ అవకాశం కూడా బాగా తగ్గిపోతుంది. ఇక పదేళ్లు దాటాక ఊపిరితిత్తులు సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, ధూమపానం అలవాటు పరిమితంగా ఉన్న వారికి మాత్రమే ఇది వర్తి్స్తుందని స్పష్టం చేశాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.
Updated Date - Jun 28 , 2024 | 09:14 PM