ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: మానవత్వం అంటే ఇదే కదా! మనసుకు హత్తుకునే వీడియో!

ABN, Publish Date - Apr 23 , 2024 | 08:33 PM

షాపులో చిక్కుకుపోయి అల్లాడుతున్న ఓ కుక్క పిల్లను తల్లి వద్దకు చేర్చారు కొందరు మానవతామూర్తులు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Puppy, Mother United by strangers

ఇంటర్నెట్ డెస్క్: నెట్టింట్లో నిత్యం అనేక వీడియోలు కాలుపెడుతున్నా మనసుకు హత్తుకునే వీడియోలు మాత్రం కొన్నే ఉంటాయి. అలాంటి ఓ వైరల్ (Viral) వీడియో ప్రస్తుతం జనాల మనసుల్లో సంతోషం నింపింది. వీడియో చూసిన అనేక మంది మానవత్వం అంటే ఇదే కదా అంటూ కామెంట్ చేశారు.

కపిలా అభిషేక్ తివారీ అనే యువతి ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కపిల, ఆమె స్నేహితులకు ఇటీవల ఓ కుక్క మూసి ఉన్న షాపు షట్టర్ కింద తవ్వేందుకు ప్రయత్నిస్తూ కనిపించింది. కుక్క దగ్గరకు వెళ్లాక వారికి విషయం అర్థమయ్యింది. షాపులోపల ఓ కుక్క పిల్ల చిక్కుకుపోయింది. దాన్ని బయటకు ఎలా తీసుకురావాలో తెలీక తల్లి కుక్క తెగ టెన్షన్ పడుతోంది. ఇది చూసిన వారు తల్లి,పిల్లను ఒక్కటి చేసేందుకు రంగంలోకి దిగారు (People reunites puppy with its mother).

Viral: ఎయిర్ ఇండియా సిబ్బంది నిర్వాకాన్ని సీక్రెట్‌గా రికార్డు చేసిన ప్యాసెంజర్! వీడియో వైరల్


తొలుత వారు షట్టర్ తెరిచేందుకు ప్రయత్నిద్దామనుకున్నా తాళం వేసి ఉండటంతో కుదరలేదు. చివరకు వారు షాపు ఓనర్ ఫోన్ నెంబర్ కనుక్కుని అతడికి విషయం చెప్పారు. మూడు గంటల తరువాత వచ్చి ఓనర్ షాపు తెరవడంతో పిల్ల కుక్క, తల్లికుక్క వద్దకు చేరింది. కుక్క పిల్ల క్షేమంగా ఉండటం చూసి తల్లి కుక్క తెగ సంబరడిపోయింది.

వీధి కుక్కే కదా అని వెళ్లిపోకుండా దాని సమస్య తీర్చిన కపిల, ఆమె స్నేహితులపై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. మానవత్వం అంటే ఇదే అంటూ అనేక మంది కామెంట్ చేశారు. కపిలకు, ఆమె స్నేహితులకు అనేక మంది ధన్యవాదాలు తెలిపారు. ఈ వీడియో జనాలకు విపరీతంగా నచ్చడంతో 83 వేల వరకూ వ్యూస్ వచ్చాయి. మరి ఇంతగా వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరూ ఓమారు లుక్కేయండి.

Read Latest Offbeat and Telugu News

Updated Date - Apr 23 , 2024 | 08:48 PM

Advertising
Advertising