ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: గున్న ఏనుగుపై దాడి.. తల్లి పక్కనే ఉన్నా రిస్క్ చేసిన హిప్పో! చివరకు..

ABN, Publish Date - Jul 15 , 2024 | 05:34 PM

పిల్ల ఏనుగును కాపాడుకునేందుకు తల్లి ఏనుగు హిప్పోపై దాడి చేసిన ఘటన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తల్లి ఏనుగు వేగంగా స్పందించిన తీరు చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: పిల్లలను రక్షించుకునేందుకు ఏ జీవి అయినా ఉగ్రరూపం దాలుస్తుంది. సహజంగా దూకుడు ఎక్కువ ఉండే కొన్ని జంతువులు మరింత దారుణ దాడులకు దిగుతాయి. ఏనుగులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. పిల్ల ఏనుగుపై దాడికి సిద్ధమైన హిప్పోకు తల్లి ఏనుగు చుక్కలు చూపించిన తీరు వీడియోలో చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.

Viral: వీడసలు మనిషేనా!? రైలు బయలుదేరగానే డోర్ పక్కన రాడ్ పట్టుకుని..


హిప్పోపోటామస్ చాలా దూకుడు స్వభావం గల జంతువులు. నిత్యం సరస్సులు, తటాకాల్లో ఉండేందుకు ఇష్టపడే ఇవి తమ ఇలాకాలోకి ఏ జంతువైనా వస్తే అస్సలు సహించవు. మొసళ్లపై కూడా దాడి చేసేందుకు వెనకాడవు. అంతటి ప్రమాకరమైన ఓ హిప్పో చిన్న గున్న ఏనుగును టార్గెట్ చేసింది. మెల్లగా దానివైపు కదులుతూ దాడి చేసేందుకు రెడీ అయ్యింది. పక్కనే ఉన్న తల్లి ఏనుగు ఇదంతా గమనించింది. హిప్పో దాడి చేసే లోపే దానిపై ప్రతిదాడికి దిగింది. అంతపెద్ద ఏనుగు తన దంతాలతో పొడుస్తూ ఉంటే హిప్పో తట్టుకోలేక వెంటనే వెనక్క మళ్లింది. బిడ్డ సేఫ్ అని తెలియగానే పెద్ద ఏనుగు గున్న ఏనుగును తీసుకుని తటాకం బయటకు వచ్చేసింది. తల్లి ఏనుగు స్పందించడం మరో క్షణం ఆలస్యమై ఉంటే గున్న ఏనుగు ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే.


వీడియోలో ఇదంతా చూసిన జనాలు తల్లి ఏనుగు దూకుడు చూసి ఆశ్చర్యపోతున్నారు. తన సంతానాన్న కాపాడుకునేందుకు ఏ జీవి అయినా విరుచుకుపడుతుందని కామెంట్ చేశారు. దాడికి రిస్క్ చేసిన హిప్పో తగిన గుణపాఠమే నేర్చుకుందని కొందరు కామెంట్ చేశారు. పిల్లల రక్షణ విషయంలో ఏనుగులు చాలా అప్రమత్తంగా ఉంటాయని వాటిని ఎదురుదాడిని తట్టుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదని కొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్ అవుతోంది.

Read Viral and Telugu News

Updated Date - Jul 15 , 2024 | 05:35 PM

Advertising
Advertising
<