ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: అయ్యో పాపం! స్వీటు బాక్సులు ప్యాక్ చేస్తుండగా.. ఎంత ఘోరం జరిగిందో చూడండి..

ABN, Publish Date - Feb 02 , 2024 | 08:51 PM

‘‘ఏ నిమిషానికి.. ఏమి జరుగునో.. ఎవరూహించెదరూ..’’ అని ఓ సిని కవి అన్నట్లుగా.. అంతవరకూ సంతోషంగా ఉన్న మనిషి.. అంతలోనే విషాదంలో కూరుకుపోతుంటాడు. అలాగే అప్పటిదాకా మన కళ్ల ముందు తిరుగుతన్న వారు.....

‘‘ఏ నిమిషానికి.. ఏమి జరుగునో.. ఎవరూహించెదరూ..’’ అని ఓ సిని కవి అన్నట్లుగా.. అంతవరకూ సంతోషంగా ఉన్న మనిషి.. అంతలోనే విషాదంలో కూరుకుపోతుంటాడు. అలాగే అప్పటిదాకా మన కళ్ల ముందు తిరుగుతన్న వారు.. ఆ మరుక్షణంలోనే మృత్యు ఒడిలోకి జారుకుంటుంటారు. ఇలాంటి విషాద ఘటనలు నిత్యం మన కళ్ల జరుగుతూనే ఉంటాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి విషాద ఘటనే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి స్వీటు బాక్సులు ప్యాక్ చేస్తుండగా.. దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) ఆగ్రాలోని కమలానగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ స్వీట్ షాపులో (Sweet shop) కొందరు కూలీలు వివిధ రకాల స్వీట్లను బాక్సుల్లో ప్యాక్ చేస్తున్నారు. ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. నేలపై కూర్చున్న కొందరు స్వీటు బాక్సులు ప్యాక్ చేస్తున్నారు. అయితే వారిలో ఓ యువకుడు పని చేస్తూ ఉన్నట్టుండి స్పృహతప్పి వెనక్కు పడిపోయాడు. దీంతో చుట్టూ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక అయ్యారు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Viral Video: ప్రేమికులకు కోపం తెప్పించిన స్నేహితుడు.. తీరా లవ్ ప్రపోజ్ చేసే సమయంలో అతను చేసిన నిర్వాకం..

అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటు (heart attack) కారణంగానే అతను మృతి చెందినట్లు చెప్పారు. అంతవరకూ తమ మధ్య సంతోషంగా ఉన్న వ్యక్తి.. ఆ మరుక్షణమే ఇలా మరణించడాన్ని వారంతా జీర్ణించుకోలేకున్నారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు మొత్తం స్వీటు షాపులోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భావోద్వేగంతో కూడిన కామెంట్లు చేస్తున్నారు. ‘‘అయ్యో! ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘విధి ఎంతో విచిత్రమైంది’’.. అంటూ మరికొందరు, ‘‘ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువవుతున్నాయి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Women: కులాంతర వివాహం చేసుకున్న దంపతులు.. కట్ చేస్తే ఉన్నట్టుండి కారు చోరీ.. చివరకు పోలీసులు విచారించగా..

Updated Date - Feb 02 , 2024 | 08:51 PM

Advertising
Advertising