ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Modified Toycar: వీడెవడండీ బాబూ! ఇంజినీరింగ్ చదువును తెలివిగా వాడి.. బొమ్మ కారుతో గిన్నిస్ రికార్డు!

ABN, Publish Date - Feb 20 , 2024 | 05:49 PM

ఇంజినీరింగ్ చదువు ఇచ్చిన నైపుణ్యాలను కొత్తగా వాడుకున్న ఓ జర్మన్ విద్యార్థి ఏకంగా గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నాడు.

ఇంటర్నెట్ డెస్క్: ఇంజినీరింగ్ చదువు ఇచ్చిన నైపుణ్యాలను కొత్తగా వాడుకున్న ఓ జర్మన్ విద్యార్థి ఏకంగా గిన్నిస్ రికార్డు (Guiness Records) సొంతం చేసుకున్నాడు. బొమ్మ కారుతో (Modified Toy car) ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇంజినీరింగ్ నైపుణ్యాలున్న (Engineering Skills) వారు ఉన్నత ఉద్యోగాలు సాధించేందుకు, కొత్త సంస్థలు నెలకొల్పుతుంటే ఈ విద్యార్థి మాత్రం సపరేటుగా రూట్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మార్సల్ పాల్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది.

Empty Airplane: ఇద్దరే ప్రయాణికులతో బయలుదేరిన విమానం.. ఒంటరిగా ఉండటంతో తోటి ప్రయాణికుడు చేసిన పనికి..


ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బొమ్మకారును సృష్టించిన పాల్ గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నాడు. అతడి బొమ్మ కారు గరిష్ఠ వేగం సుమారు 148 కిలోమీటర్లు. తనకున్న ఇంజినీరింగ్ నైపుణ్యాలతో అతడు విద్యుత్‌తో నడిచే బొమ్మకారుకు మార్పులు చేశాడు. ఆ తరువాత కారుపై కూర్చుని మునుపెన్నడూ చూడని వేగంతో దూసుకుపోయి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. బొమ్మ కారుపై ఏటవాలుగా కూర్చుని అతడు నడుపుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోకు ఇప్పటివరకూ 6.5 లక్షల వ్యూస్ వచ్చాయి.

Indian Railways: రైల్లో ఒంటరిగా వెళుతున్న యువతి..తానున్న బోగీలో దృశ్యాన్ని అక్కకు వాట్సాప్‌లో షేర్ చేయడంతో..


అతడి వెరైటీ ప్రయత్నాన్ని చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. రికార్డు అంటే ఇదికదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫెర్రారీ లాంటి రేసింగ్ వాహనం సైకిల్ ధరకు అందుబాటులోకి రావడమంటే ఇదే అని అన్నారు. చూడటానికి ఇది ప్రమాదకరమైన సాహసంగా కనిపిస్తోంది కానీ ఇతడిని మెచ్చుకోవాల్సిందే అని కొందరు అభిప్రాయడ్డారు. ఈ కారును సిద్ధం చేసేందుకు పాల్ దాదాపు 10 నెలలు కష్టపడ్డాడని గిన్నిస్ రికార్డు వారు తెలిపారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 20 , 2024 | 05:50 PM

Advertising
Advertising