Share News

Empty Airplane: ఇద్దరే ప్రయాణికులతో బయలుదేరిన విమానం.. ఒంటరిగా ఉండటంతో తోటి ప్రయాణికుడు చేసిన పనికి..

ABN , Publish Date - Feb 20 , 2024 | 04:16 PM

ఇద్దరే ప్రయాణిస్తున్న ఓ విమానంలో ఓ ప్రయాణికుడు చేసిన పనికి రెండో వ్యక్తికి భారీ షాక్.

Empty Airplane: ఇద్దరే ప్రయాణికులతో బయలుదేరిన విమానం.. ఒంటరిగా ఉండటంతో తోటి ప్రయాణికుడు చేసిన పనికి..

ఇంటర్నెట్ డెస్క్: విమానం..అందునా ఎకానమీ సెక్షన్లో ప్రయాణిచడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. సీట్లన్నీ నిండిపోవడంతో ఇరుక్కుని కూర్చోలేకపోయామని ఎంతో మంది గగ్గోలు పెడుతుంటారు. కానీ ఇటీవల సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు (Southwest Airlines) ఇద్దరు ప్రయాణికులకు వింత పరిస్థితి ఎదురైంది. విమానంలో వారు మినహా మిగతా ప్రయాణికులెవరూ లేకపోయినా ఓ వ్యక్తి చేసిన పనికి రెండో ప్రయాణికుడు షాకైపోయాడు (Empty airplane with two passengers). అతడు నెట్టింట షేర్ చేసిన ఫొటో ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది (Trending).

VandeBharat: వందేభారత్ రైళ్లు ఎలా శుభ్రం చేస్తారో తెలుసా?


విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు రెండో వ్యక్తి వెనక సీటులోనే కూర్చున్నాడు. విమానం అంతా ఖాళీగా ఉన్నా తన తోటి ప్రయాణికుడు తన వెనకాలే కూర్చోవడం ఆంథొనీ థామస్‌కు అస్సలు అర్థం కాలేదు. అతడి తీరు కాస్త తేడాగా కూడా అనిపించింది. దీంతో, ఆంథొనీ సోషల్ మీడియా వేదికగా తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. తామిద్దరి ఫొటోను కూడా షేర్ చేశాడు. విమానం అంతా ఖాళీగా ఉన్నా అతడు నా వెనకే కూర్చోవడం ఏంటో!? మరో చోట ఎక్కడైనా కూర్చోవచ్చుగా? ఇదంతా ఏంటో తేడాగా ఉంది’’ ఆంథొనీ కామెంట్ చేశాడు.

Google Pune Office: గూగుల్‌లో జాబ్ కోసం ఎగబడేది ఇందుకే.. ఒక్కసారి వాళ్ల ఆఫీసుకు వెళితే..


ఈ ఫొటోకు నెట్టింట భారీ రెస్పాన్స్ (Viral) వచ్చింది. అనేక మంది ఆంథొనీ అభిప్రాయంతో ఏకీభవించారు. ఆ ప్రయాణికుడి ప్రవర్తన కాస్త వింతగానే ఉందని కామెంట్ చేశాడు. మరికొందరు మాత్రం ఆ ప్రయాణికుడు భయపడి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ఇలాంటి సందర్భాల్లో కొందరు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడరని చెప్పుకొచ్చారు. ‘‘నీకు అతడి ప్రవర్తన ఇబ్బందిగా అనిపిస్తే నువ్వున్న వరుసలోనే రెండు సీట్ల అవతల కూర్చోమని చెప్పు’’ అంటూ సలహా ఇచ్చారు. దీంతో, ఈ దృశ్యం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 20 , 2024 | 08:02 PM