ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: మగ సింహం ప్రేమ అంటే ఇదీ.. ఆడ సింహం కోసం ఎంత రిస్క్ చేసిందంటే..

ABN, Publish Date - May 21 , 2024 | 03:31 PM

హైనాల నుంచి ఆడ సింహాన్ని మగ సింహం సింగిల్‌గానే కాపాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇదే ప్రేమ అంటే జనాలు ఈ దృశ్యాన్నికి మరో ట్విస్ట్ ఇచ్చారు.

Male lion saves female lion from hyenas attack

ఇంటర్నెట్ డెస్క్: అడవిలో సింహాలకు కంటి మీద కునుకు లేకుండా చేసే జంతువు ఏదైనా ఉందీ అంటే అది హైనానే. సింహం దాడిని తట్టుకునే శరీర దారుఢ్యం హైనాల సొంతం. అంతేకాదు.. ఎప్పుడూ గుంపులుగా తిరిగే ఈ జీవులు ఒంటరి సింహాలు కనిపిస్తే మట్టుపెట్టేందుకు ఏమాత్రం వెనకాడవు. ముఖ్యంగా పిల్ల సింహాలు, ఆడ సింహాలు, ముసలి సింహాలకు వీటితో ప్రమాదం ఎక్కువ. వయసులో ఉన్న మగ సింహాలను చూస్తే మాత్రం హైనాలు వెనకంజ వేస్తాయి. రిస్క్ వద్దునుకుని సైలెంట్‌గా సైడైపోతాయి. తాజాగా హైనాల బారినపడి చావు అంచుల వరకూ వెళ్లిన ఓ ఆడ సింహాన్ని మగ సింహం కాపాడిన తీరు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఒంటరిగా ఉన్న ఓ ఆడ సింహం హైనాల మంద బారిన పడుతుంది. ఇలాంటి అవకాశం కోసం కాచుకుని కూర్చునే హైనాలు ఆడ సింహాన్ని టార్గెట్ చేశాయి. అన్ని వైపులా చుట్టుముట్టి కన్‌ఫ్యూజ్ చేస్తూ దాడి మొదలెట్టాయి. అన్ని హైనాలు దాడి చేస్తుంటే తట్టుకోలేని ఆడ సింహం చేతులెత్తేసింది. తోటి సింహాల కోసం ఆక్రందనలు చేయడం ప్రారంభించింది (Male lion saves female lion for hyena attack ).

Viral: రేయ్..ఎవర్రా మీరంతా.. పుచ్చకాయల్ని ఎలా కల్తీ చేస్తున్నారో చూస్తే..


ఆ ఆక్రందనలు మగ సింహం చెవిన పడటంతో పరిగెత్తుకుంటూ అక్కడి వచ్చేసింది. సింగిల్‌గా ఉన్నా లెక్క చేయకుండా హైనాలపై దాడి ప్రారంభించింది. ఓ హైనా పీక పట్టుకుని దానికి చుక్కలు చూపించింది. మగ సింహం దాడికి బెదిరిపోయిన హైనాలు అక్కడ నుంచి చెల్లాచెదురైపోయాయి. ఎట్టకేలకు ధైర్యం కూడదీసుకుని మగసింహాన్ని చుట్టుముట్టి బెదిరించే ప్రయత్నం చేశాయి. వీడియో అక్కడితో ముగిసిపోవడంతో చివరకు ఏం జరిగిందో తెలియరాలేదు.

జనాలు మాత్రం ఈ వీడియో చూసి షాకైపోతున్నారు. మగ సింహం ధైర్యం, తెగువ చూసి ఆశ్చర్యపోతున్నారు. సింగిల్ ఉన్నా లెక్క చేయకుండా హైనాలను బెంబేలెత్తించిన దాని పవర్ చూసి నోరెళ్లబెడుతున్నారు. తన నెచ్చెలి అపాయంలో ఉందని తెలిసి సింహం రెచ్చిపోయిందని, ఆడ సింహం పిలవగానే వచ్చి దాన్ని కాపాడిందంటూ కొందరు సీన్‌కు మరో వివరణ ఇచ్చారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది. వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Updated Date - May 21 , 2024 | 03:40 PM

Advertising
Advertising