ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Israel- Gaza Conflict: గాజాలో అద్భుతం.. యుద్దంలో మరణించిన తల్లి.. కడుపులో బిడ్డ సేఫ్!

ABN, Publish Date - Apr 22 , 2024 | 01:11 PM

ఇజ్రాయెల్-గాజా యుద్ధం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనల కలిగిస్తోంది. ఆ యుద్ధం ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుందో తెలియక చాలా దేశాల స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతున్నాయి. ఇరాన్ చేసిన దాడులకు ప్రతికారంగా ఇజ్రాయెల్ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.

Baby rescued in Israel- Gaza Conflict

ఇజ్రాయెల్-గాజా యుద్ధం (Israel- Gaza War) ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు కలిగిస్తోంది. ఆ యుద్ధం ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుందో తెలియక చాలా దేశాల స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతున్నాయి. ఇరాన్ చేసిన దాడులకు ప్రతికారంగా ఇజ్రాయెల్ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఎంతో మంది సాధారణ పౌరులు బలి అయ్యారు. పాలస్తీనాకి చెందిన ఓ కుటుంబం కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయింది. ఆ కుటుంబానికి చెందిన మహిళ చనిపోయే సమయానికి గర్భవతి (Pregnant).


ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల కారణంగా గాజాలోని రఫాలో ఒకేసారి బాంబుల వర్షం కురిసింది. ఆ దాడి కారణంగా మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 13 మంది చిన్నారులు ఉండడం అత్యంత విషాదకరం. ఇక, మిగిలిన వారిలో ఓ గర్భిణి కూడా ఉంది. ఆమె కూడా ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమె కడుపులోని బిడ్డ మాత్రం బతికే ఉంది. చనిపోయే సమయానికి తల్లి 30 వారాల గర్భంతో ఉంది. ఆమెను గుర్తించిన వైద్యులు వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డను (Baby) బయటకు తీశారు.


ఆ చిన్నారి 1.4 కిలోల బరువుతో జన్మించింది. ఆ చిన్నారిని ప్రస్తుతం ఇంక్యుబేటర్‌లో ఉంచారు. ఆ చిన్నారిని చూసి ఆ కుటుంబ బంధువులు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. ఆ చిన్నారికి రౌ (Rouh) అని పేరు పెట్టారు. రౌ అంటే స్ఫూర్తి అని అర్థం. మూడు, నాలుగు వారాల పాటు హాస్పిటల్‌లోనే అబ్జర్వేషన్‌లో ఉంచి చిన్నారిని ఎవరికి అప్పగించాలో నిర్ణయం తీసుకుంటామని డాక్టర్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

Viral: వేసవికి తెలివితో చెక్.. వేడి నుంచి ఉపశమనం కోసం ప్రజలు ఎలాంటి ట్రిక్కులను ఉపయోగిస్తున్నారో చూడండి..


Puzzle: ఈ ఫొటోలోని ఏనుగును 5 సెకెన్లలో గుర్తించగలరా?.. కేవలం 5.7 శాతం మందికే సాధ్యమైందట!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 22 , 2024 | 01:11 PM

Advertising
Advertising