ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: కూతురు లండన్ నుంచి విదేశీ ప్రియుణ్ణి ఇంటికి తీసుకొస్తే..

ABN, Publish Date - Mar 31 , 2024 | 07:13 PM

లండన్‌లో ఉంటున్న ఓ భారతీయ యువతి తన బ్రిటీష్ ప్రియుణ్ణి స్వదేశానికి తీసుకొస్తే ఆమె కుటుంబసభ్యులు అపూర్వ స్వాగతం పలికారు.

ఇంటర్నెట్ డెస్క్: కాలంతో పాటు భారతీయ సమాజంలో అనేక మార్పులు వచ్చేశాయి. భారతీయులు కులాంతర, మతాంతర వివాహాలే కాకుండా ఖండాతర వివాహాలు చేసుకుంటున్నారు. లండన్‌లో ఉంటున్న ఓ భారతీయ యువతి తన బ్రిటీష్ ప్రియుణ్ణి స్వదేశానికి తీసుకొస్తే ఆమె కుటుంబసభ్యులు అపూర్వ స్వాగతం పలికారు. వారికి పెళ్లికాకపోయినా కూడా కొత్త అల్లుడికంటే ఎక్కువగా అతడికి మర్యాదలు చేశారు (Indian Family Welcomes Daughters British Boyfriend). ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. తన కుటుంబసభ్యులు ప్రియుడికి స్వాగతం పలుకుతున్న తీరు చూసి స్వయంగా ఈ యువతే ఆశ్చర్యపోయింది.

Uber Bill: ఉబర్‌లో ఆటో బుక్ చేస్తే రూ.7.66 కోట్ల బిల్లు!


వీడియోలో కనిపించిన దాని, తొలుత విదేశీ వ్యక్తి ఇంట్లోకి రాగానే తనకు కాబోయే అత్తగారికి పాదాభివందనం చేశాడు. ఆమెకు ఓ బొకే కూడా ఇచ్చాడు. ఆమె అతడి నుదుటన తిలకం దిద్ది, సంప్రదాయ బద్ధంగా లోపలికి ఆహ్వానించింది. మిగిలిన కుటుంబసభ్యులు అతడిపై పూలు జల్లుతూ సాదర స్వాగతం పలికారు. ఈ వీడియోను షేర్ చేసిన యువతి, తన కుటుంబసభ్యుల తీరుపై హర్షం వ్యక్తి చేసింది. తన బాయ్‌ఫ్రెండ్‌కు ప్రత్యేకంగా స్వాగతం పలికారని వ్యాఖ్యానించింది.


కొద్ది రోజుల క్రితమే నెట్టింట కాలు పెట్టిన ఈ వీడియోకు ఇప్పటికే 70 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సీన్ తమ హృదయాలను హత్తుకుందని అనేక మంది కామెంట్ చేశారు. యువతి బాయ్‌ఫ్రెండ్‌ది మంచి పెంపకం అయ్యుంటుందని కొందరు కామెంట్ చేశారు. అతడు నిగర్విలా, వినయశీలిలా ఉన్నాడని కూడా కొందరు అభిప్రాయపడ్డారు. ఈ జంట కలకాలం హ్యాపీగా ఉండాలని ఆకాంక్షించారు.

Flipkart: ఇంతకు మించిన దారుణం ఉంటుందా!? ఫ్లిప్‌కార్ట్‌లో రూ.22 వేల స్మార్ట్ ఫోన్ ఆర్డరిస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 31 , 2024 | 07:15 PM

Advertising
Advertising