Share News

Uber Bill: ఉబర్‌లో ఆటో బుక్ చేస్తే రూ.7.66 కోట్ల బిల్లు!

ABN , Publish Date - Mar 31 , 2024 | 05:23 PM

ఉబర్‌లో ఆటో బుక్ చేసిన ఓ కస్టమర్‌కు భారీ షాక్ తగిలింది. బిల్లు రూ.62 అవుతుందనుకుంటే ఏకంగా రూ.7.66 కోట్లు అయినట్టు నోటిఫికేషన్ వచ్చేసరికి అతడు దిమ్మెరపోయాడు.

Uber Bill: ఉబర్‌లో ఆటో బుక్ చేస్తే రూ.7.66 కోట్ల బిల్లు!

ఇంటర్నెట్ డెస్క్: ఉబర్‌లో ఆటో (Uber Auto) బుక్ చేసిన ఓ కస్టమర్‌కు భారీ షాక్ తగిలింది. బిల్లు రూ.62 అవుతుందనుకుంటే ఏకంగా రూ.7.66 కోట్లు (Rs.7.66 crore bill) అయినట్టు నోటిఫికేషన్ వచ్చేసరికి అతడు దిమ్మెరపోయాడు. నోయిడాలోని దీపక్ తెనుగురియా అనే కస్టమర్ ఈ వింత పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా (Viral) మారింది.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, దీపక్ శుక్రవారం ఉబర్‌లో ఓ ఆటో బుక్ చేశాడు. మరి కాసేపట్లో తన గమ్యస్థానానికి చేరుకుంటాడనంగా అతడి బిల్లుకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. తన ప్రయాణానికి దాదాపు రూ.62 బిల్లు అవుతుందనంగా రూ.7.66 కోట్లు అయినట్టు నోటిఫికేషన్‌లో కనిపించడంతో అతడు దిమ్మెరపోయారు.

Flipkart: ఇంతకు మించిన దారుణం ఉంటుందా!? ఫ్లిప్‌కార్ట్‌లో రూ.22 వేల స్మార్ట్ ఫోన్ ఆర్డరిస్తే..


అతడి బిల్లులో ప్రయాణ చార్జీ రూ.1,67,74,647 కాగా వెయిటింగ్ చార్జి రూ.5,99,09189గా తేలింది. ప్రమోషనల్ ఆఫర్ కింద మరో 75 రూపాయలు డిస్కౌంట్ కూడా ఇవ్వడం కొసమెరుపు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను దీపక్ స్నేహితుడు నెట్టింట పంచుకున్నాడు. తన కోసం డ్రైవర్ వేచి చూడలేదు కాబట్టి వెయిటింగ్ చార్జి ఉండకూడదని దీపక్ అనడం వీడియోలో మనం చూడొచ్చు. తన జీవితంలో ఇంత పెద్ద సంఖ్యను ఎప్పుడూ చూడలేదని కూడా దీపక్ జోక్ చేశాడు.

ఇక ఘటనపై జనాలు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. చంద్రయాన్ టిక్కెట్టు బుక్ చేసుకున్నా ఇంతకంటే తక్కువ ధరలోనే వస్తుందని కొందరు అన్నారు. ఘటన వైరల్ కావడంతో ఉబర్ కూడా స్పందించి దీపక్‌కు క్షమాపణలు చెప్పింది. కాస్తంత సమయం ఇస్తే సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది.

Spit Stains: ఈ మహిళ కష్టం చూసాకైన జనాల్లో మార్పొస్తుందా? నెటిజన్లను కలచివేస్తున్న వీడియో!

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 31 , 2024 | 05:27 PM