ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: చనిపోయే ముందు మనవరాళ్లకు భారీ షాకిచ్చాడుగా! తాతలను హర్ట్ చేస్తే ఎవరికైనా ఇదే గతి!

ABN, Publish Date - Mar 09 , 2024 | 06:44 PM

చనిపోయేముందు తన మనవరాళ్లకు ఊహించని షాకిచ్చాడో వృద్ధుడు. బ్రిటన్‌లో జరిగిన ఈ ఉదంతం నెట్టింట వైరల్

ఇంటర్నెట్ డెస్క్: అసలు కంటే కొసరు ఎక్కువ అని అంటారు. మనవలు, మునిమనవల విషయంలో ఇది అక్షరాలా నిజం. వృద్ధులకు తమ సొంత పిల్లల మీద కంటే మనవలు మనవరాళ్లపై ప్రేమ, ఆపేక్షలు ఎక్కువగా ఉంటాయి. అయితే, వాళ్లు పొరపాటు చేస్తే దిమ్మతిరిగేలా షాకిచ్చేందుకూ కొందరు వృద్ధులు సర్వదా సిద్ధంగా ఉంటారు. బ్రిటన్‌లో (Britain) జరిగిన ఓ ఉదంతం గురించి తెలుసుకుంటే సరిగ్గా ఇదే అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఘటన వైరల్‌గా (Viral) మారింది.

Viral: మాటు వేసి వేటాడే చిరుతనే బురిడీ కొట్టించిన బాలుడు.. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాన్ని చూస్తే..


ఫ్రెడ్రిక్ వార్డ్ సీనియర్ అనే వృద్ధుడు 2020లో మరణించారు. మిలిటరీలో సైనికుడిగా పని చేసిన ఆయనకు రూ.5 కోట్లకు పైగా ఆస్తి ఉంది. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు, మనవరాళ్లు కూడా ఉన్నారు. ఫ్రెడ్రిక్‌ తనయుడైన ఫ్రెడ్రిక్ వార్డ్ జూనియర్ 2015లోనే అనారోగ్యం కారణంగా మరణించాడు. కొడుకు మరణం తరువాత వారి కుటుంబంలో బంధాలు బలహీనపడ్డాయి. జూనియర్ కుమార్తెలతో ఫ్రెడ్రిక్‌కు సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి. ఫ్రెడ్రిక్ ఊపిరితిత్తుల సమస్యతో పలుమార్లు ఆసుపత్రి పాలైనా వారు ఆయనను పరామర్శిచేందుకు రాలేదు. దీంతో, నొచ్చుకున్న పెద్దాయన పోయే ముందు వారికి భారీ షాకిచ్చాడు. తన ఐదుగురు మనవరాళ్లకు ఆస్తిలో కేవలం రూ.5 వేలు మాత్రమే దక్కేలా విల్లు రాసి పెట్టి పోయారు. మిగతా మొత్తాన్ని తన ఇద్దరు సంతానానికి రాసిచ్చేశారు. (Hurt over grandkids not visiting often UK man leaves them only 50 pounds).

Viral: ఆన్‌లైన్‌ షాపింగ్‌లో తప్పనిసరిగా ఇది ఫాలో అవ్వాలి! రూ. 23 వేలు పెట్టి లగ్జరీ షూస్ ఆర్డరిస్తే..


ఇది చూసిన ఆ ఐదుగురు మహిళలు కోర్టుకెక్కారు. తాత ఆస్తిలో తమకు న్యాయంగా మరింత వాటా రావాలని వాదించారు. తమ అత్త, మామలు తాతను ఏమార్చి ఆస్తి తమకు దక్కకుండా చేశారని ఆరోపించారు. కానీ, కోర్టు మాత్రం మహిళల వాదనను తోసి పుచ్చింది. వారసుల తీరుతో హర్ట్ అయిన పెద్దాయనకు తన ఆస్తిని ఎవరికైనా రాసుకునే హక్కు ఉందని తేల్చి చెప్పింది.

Viral: భార్య తనకు సొంత చెల్లెలు అవుతుందని పెళ్లైన 6 ఏళ్లకు తెలిసి..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 09 , 2024 | 06:53 PM

Advertising
Advertising