Share News

Viral: మాటు వేసి వేటాడే చిరుతనే బురిడీ కొట్టించిన బాలుడు.. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాన్ని చూస్తే..

ABN , Publish Date - Mar 09 , 2024 | 03:21 PM

చిరుతను బురిడీ కొట్టించిన ఓ 12 ఏళ్ల బాలుడి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: మాటు వేసి వేటాడే చిరుతనే బురిడీ కొట్టించిన బాలుడు.. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాన్ని చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: చిరుత, పులి, సింహం లాంటి జంతువుల కనబడితే ఎవరైనా వణికిపోవాల్సిందే. ఏం చేయాలో తెలీక నిశ్చేష్టులైపోవాల్సిందే. ఎంతటి సాహసవంతులైనా సరే వీటిని చూడగానే క్షణ కాలం తత్తరపాటుకు లోనవుతారు. అయితే, ప్రస్తుత ట్రెండింగ్‌ వీడియోలోని బాలుడు మాత్రం కాస్త డిఫరెంట్. చిరుత తనకు అత్యంత సమీపం నుంచి వెళుతున్నా అతడు అదరలేదు బెదరలేదు. దాన్ని చూసిన మరుక్షణమే చిరుతను బురిడీ కొట్టించే ప్లాన్ రెడీ చేసేసుకున్నాడు. అత్యంత చాకచక్యంగా తన ప్లాన్‌ను అమలు చేసి తనని తాను రక్షించుకోవడంతో పాటు ఇరుగు పొరుగు వారినీ ప్రమాదం నుంచి బయట పడేశాడు. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఓ ఊపు ఊపుతోంది (Viral Video). బుడ్డోడి ధైర్యసాహసాలు చూసి ఆశ్చర్యపోతున్నారు. మహారాష్ట్రలోని (Maharashtra) నాసిక్‌ జిల్లాలో (Nashik) ఈ ఘటన వెలుగు చూసింది.

Viral: భార్య తనకు సొంత చెల్లెలు అవుతుందని పెళ్లైన 6 ఏళ్లకు తెలిసి..

వీడియోలోని కుర్రాడి పేరు మోహిత్ అహీరే. వయసు జస్ట్ 12 ఏళ్లు. అతడు ఉండేది మాలేగావ్‌లో! ఓ రోజు అతడు తన ఇంట్లో కిటికీ పక్కన టేబుల్ ఎక్కి కూర్చుని మొబైల్ వీడియో గేమ్ ఆడుకుంటుండగా చిరుత అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చేసింది. టేబుల్‌పై ఉన్న బాలుడిని అది గమనించలేదు కానీ బుడ్డోడు మాత్రం చిరుతను చూశాడు. కానీ, అతడు సాధారణ పిల్లల్లాగా అతడు చిరుతను చూసి బెంబేలెత్తిపోలేదు. పెద్దపెట్టున అరుపులు, ఏడుపు మొదలెట్టలేదు. అది వెళుతున్న తీరును సైలెంట్‌గా గమనించి అప్పటికప్పుడు దాన్ని బంధించే ప్లాన్ రెడీ చేశాడు (12 year old brave Nashik boy locks leopard in room CCTV footage).


టేబుల్‌పై ఉన్న బాలుడిని గమనించని చిరుత నేరుగా లోపలికి వెళ్లిపోయింది. అది లోపలికి వెళ్లగానే కుర్రాడు సైలెంట్‌గా టేబుల్ దిగి ఇంటి బయటకు వచ్చేశాడు. ఆ తరువాత చడీచప్పుడు చేయకుండా బయట నుంచి తలుపునకు గొళ్లెం పెట్టి చిరుతను బంధించేశాడు. మాటు వేసి దాడి చేసే చిరుతను అంతే అసాధారణ ధైర్యసాహసాలు, చాకచక్యంతో బంధించాడు. ఇక ఈ వీడియోను షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా కూడా బాలుడి ధైర్యసాహసాలు చూసి ఆశ్చర్యపోయారు. అంతటి ప్రమాదంలోనూ అతడి స్థితప్రజ్ఞతకు నివ్వెరపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరుంటే ఏం చేస్తారు? అంటూ నెటిజన్లపై ఓ ప్రశ్న సంధించారు.

Viral: ఆనంద్ మహీంద్రా దీన్ని చూస్తే ఎలా ఫీలవుతారో? నెటిజన్లకు షాకిస్తున్న వైరల్ వీడియో!

ఈ వీడియోకు నెట్టింట పెద్ద రెస్పాన్సే వచ్చింది. బుడ్డోడి టాలెంట్ చూసినవారందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ పరిస్థితుల్లో తాముంటే భయంతో గుండెపోటు బారిన పడి ఉండేవాళ్లమని కొందరు కుండబద్దలు కొట్టారు. ఇంత చిన్న వయసులో ఇంతటి ధైర్యసాహసాలు ఉండటం మామూలు విషయం కాదని కామెంట్ చేశారు. వయసుకు మించిన చాకచక్యం కనబరిచిన బుడ్డోడు దేశముదురంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. చూసి మీరూ ఎంజాయ్ చేయండి!

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 09 , 2024 | 03:23 PM