Share News

Viral: ఆనంద్ మహీంద్రా దీన్ని చూస్తే ఎలా ఫీలవుతారో? నెటిజన్లకు షాకిస్తున్న వైరల్ వీడియో!

ABN , Publish Date - Mar 08 , 2024 | 04:54 PM

మహీంద్రా స్కార్పియో కారులో ఇంత మంది ప్రయాణించొచ్చా! నెటిజన్లను షేక్ చేస్తున్న వీడియో ఇది.

Viral: ఆనంద్ మహీంద్రా దీన్ని చూస్తే ఎలా ఫీలవుతారో? నెటిజన్లకు షాకిస్తున్న వైరల్ వీడియో!

ఇంటర్నెట్ డెస్క్: భారతీయులకు బాగా నచ్చే ఎస్‌యూవీల్లో మహీంద్రా స్కార్పియో కూడా ఒకటి. విదేశీ బ్రాండ్లతో సమానమైన క్రేజ్ దీని సొంతం. ఎటువంటి రోడ్లపైనా అయినా దూసుకుపోయే ఈ ఎస్‌యూవీ ఆఫ్‌రోడింగ్‌కు అత్యంత అనుకూలమైనది. అయితే, ఓ ఫ్యామిలీ ఈ కారును వాడిన తీరు చూసి జనాలు ప్రస్తుతం షాకైపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఈ వీడియోను చూస్తే ఎలా రియాక్టవుతారో? అంటూ వరుస పెట్టి కామెంట్లు చేస్తున్నారు.

Viral: భార్య తనకు సొంత చెల్లెలు అవుతుందని పెళ్లైన 6 ఏళ్లకు తెలిసి..


మహీంద్రా కారు పెద్దదే కానీ వీడియోలోని కారులో మాత్రం ఏకంగా 18 మంది ప్రయాణించారు. ఓ రెస్టారెంట్ వద్ద ఆగిన ఈ కారులోంచి ఒక్కొక్కరుగా 18 మంది దిగడం చూసి అందరూ షాకైపోతున్నారు. ఆడామగా పిల్లా పెద్దా అందరూ కలిపి మొత్తం 18 మంది ఒక్కకారులో ఇరుక్కుని ప్రయాణించారు. వీడియో నిడివి కేవలం 48 సెకెన్లే అయినా ఇది జనాల్ని నోరెళ్లబెట్టేలా చేస్తోంది. రెస్టారెంట్ వద్ద ఉన్న వ్యక్తి ఆ కారులోంచి దిగుతున్న వారిని లెక్కించి మొత్తం 18 మంది ఉన్నారని తేల్చారు (18 members travel in Scorpio Car).

Puzzle: ఇక్కడ కనిపిస్తున్న రెండు ఫొటోల్లో 3 తేడాలు ఉన్నాయి.. కనిపెట్టడం మీ వల్ల అవుతుందేమో ప్రయత్నించండి..


కేవలం రోజుల వ్యవధిలోనే ఈ వీడియోకు ఆరు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతమంది ఒక్క కారులో ఎలా ఇరుక్కుని కూర్చోగలిగారో? అసలు ఎంత దూరం నుంచి వారు ప్రయాణిస్తున్నారో? అనుకుంటూ జనాలు షాకైపోతున్నారు. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా చూస్తే ఎలా రియాక్టవుతారో? అని మరికొంత మంది సందేహం వ్యక్తం చేశారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 08 , 2024 | 05:01 PM