Share News

Viral: ఆన్‌లైన్‌ షాపింగ్‌లో తప్పనిసరిగా ఇది ఫాలో అవ్వాలి! రూ. 23 వేలు పెట్టి లగ్జరీ షూస్ ఆర్డరిస్తే..

ABN , Publish Date - Mar 09 , 2024 | 05:29 PM

ఆన్‌లైన్‌లో రూ.23 వేల ఖరీదైన లగ్జరీ షూస్ ఆర్డరిచ్చిన ఓ వ్యక్తికి చివరకు భారీ షాక్ తగిలింది.

Viral: ఆన్‌లైన్‌ షాపింగ్‌లో తప్పనిసరిగా ఇది ఫాలో అవ్వాలి! రూ. 23 వేలు పెట్టి లగ్జరీ షూస్ ఆర్డరిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఆన్‌లైన్‌లో (Online Shopping) రూ.23 వేల ఖరీదైన లగ్జరీ షూస్ ఆర్డరిచ్చిన ఓ వ్యక్తికి చివరకు భారీ షాక్ తగిలింది. బాధితుడు తన అనుభవాన్ని నెట్టింట పంచుకోవడంతో ఈ ఉదంతం వైరల్‌గా (Viral) మారింది. @Ace_Of_Pace ట్విట్టర్ అకౌంట్‌లో అతడు అసలేం జరిగిందో పూస గుచ్చినట్టు చెప్పుకొచ్చాడు. ఇటీవల అతడు టాటా క్లిక్ లగ్జరీ‌ ద్వారా ఆన్‌లైన్‌లో రూ.22,999 పెట్టి న్యూ బ్యాలెన్స్ గ్రే అండ్ బ్లూ స్నీకర్స్ ఆర్డరిచ్చాడు. వాటి కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న అతడికి డెలివరీ రోజున ఊహించని షాక్ తగిలింది.

Viral: మాటు వేసి వేటాడే చిరుతనే బురిడీ కొట్టించిన బాలుడు.. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాన్ని చూస్తే..


ఇంటికి డెలివరీ అయిన బాక్స్‌ను విప్పి చూస్తే అందులో లగ్జరీ షూస్‌‌కు బదులు సాధారణ స్లిపర్స్ దర్శనమిచ్చాయి. వాటిని చూడగానే అతడికి దిమ్మతిరిగినంతపనైంది. ఆ తరువాతే అతడికి అసలు సమస్య మొదలైంది. స్లిపర్స్‌ను తిరిగిచ్చేందుకు అతడు ప్రయత్నించగా సదరు సంస్థ అంగీకరించలేదు. వాటి నాణ్యత తెలిపేందుకు ఉద్దేశించిన క్వాలిటీ చెక్స్‌లో ఫెయిలయ్యాయన్న సంస్థ రిఫండ్ ఇచ్చేందుకు నిరాకరించింది. బాధితుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకపోవడంతో చివరకు అతడు తన ఆవేదనను నెట్టింట పంచుకున్నాడు. ఇంత జరిగినా కూడా ఆ సంస్థ తనకు సరైన ఉత్పత్తినే డెలివరీ చేసినట్టు చెప్పిందని వాపోయాడు (Man Claims Tata Cliq Sent Slippers Instead of Shoes Worth Rs 23K).

Viral: భార్య తనకు సొంత చెల్లెలు అవుతుందని పెళ్లైన 6 ఏళ్లకు తెలిసి..


తను కష్టపడి సంపాదించిన సొమ్మంతా బూడిదలో పోసిన పన్నీరైందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనలా మరెవరో మోసపోవద్దంటూ నెటిజన్లను హెచ్చరించాడు. అతడి పోస్టు చూస్తుండగానే బాగా వైరల్‌ అయింది. నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. థర్డ్ పార్టీ డెలివరీ పార్టనర్ల కారణంగా తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అనేక మంది వాపోయారు. ఆన్‌లైన్‌ ద్వారా డెలివరీ అయిన వస్తువులను ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీసి పెట్టుకోవాలని పలువురు సూచించారు. ఆన్‌లైన్ షాపింగ్ చేసేవాళ్లు కచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇదేనంటూ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 09 , 2024 | 05:38 PM