ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: అద్భుతం.. వేణుగానంతో చికిత్స! అనారోగ్యం నుంచి కోలుకుంటున్న గోవులు

ABN, Publish Date - Jul 27 , 2024 | 07:10 PM

అనారోగ్యంతో ఉన్న గోవులకు సాధారణ వైద్యంతో పాటు వేణుగానం వినిపిస్తూ అవి త్వరగా కోలుకునేలా చేస్తున్నారో గోశాల నిర్వాహకులు. మధ్యప్రదేశ్‌లో ఉన్న ఈ గోశాలకు రోజూ 20కి పైగా గోవులను చికిత్స కోసం తీసుకువస్తుంటారట.

ఇంటర్నెట్ డెస్క్: సంగీతానికి ఉన్న మహత్యం మాటలకందనిది. వెయ్యి ఏళ్లు తపస్సు చేసినా కనిపించని దేవుడు ఒక్క పాటతో కరిగిపోయి కరుణిస్తాడని పెద్దలు చెబుతారు. సంగీతానికున్న సమ్మోహనశక్తికి వేణుగానం అచ్చమైన ఉదాహరణ. జగద్గురువు శ్రీ కృష్ణుడి వేణుగానాన్ని ఆహ్వానంగా భావించి పశుపక్షాదులు ఎక్కడెక్కడి నుంచో కదిలివచ్చి ఆ పరమాత్ముడి చుట్టూ చేరేవట. ఆ మాధుర్యాన్ని తనివితీరా ఆస్వాదించేవట. ఇక సంగీతానికి రోగాలను నయం చేసే శక్తి ఉందని సైన్స్ ఎప్పుడో అంగీకరించింది. ఈ అంశాన్ని మధ్యప్రదేశ్‌లోని ఓ గోశాల మరోసారి రుజువు చేసింది (Devotional). అక్కడి నిర్వాహకులు.. రోగాల బారిన పడ్డ మూగజీవాలకు సంగీతం వినిపించి ఉపశమనం కలిగిస్తున్నారు. అవి కోలుకునేలా చేస్తున్నారు.

ఇక్కడ ఈశ్వరుడికి మందులే నైవేద్యం.. ఎందుకంటే


మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఆదర్శ్ గోశాల నిర్వాహకుడు వేణుగానం వినిపిస్తూ రోగాల బారినపడ్డ మూగజీవాలకు సాంత్వన కలిగిస్తున్నారు. ఈ గోశాలలో మూజ్యిక్ థెరపీ సాయంతో వాటి జబ్బులను నయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రోజూ ఇక్కడకు అనారోగ్యంతో ఉన్న ఆవులను తీసుకొస్తారు. సాధారణ వైద్యం చేసే క్రమంలో ఇద్దరు సిబ్బంది కాస్త దూరంలో నిలబడి వేణుగానంతో వాటిని అలరిస్తారు. సంగీతమాధుర్యంలో ఓలలాడుతున్నంత సేపు గోవులు తమ గాయాలు, అనారోగ్యాలను మర్చిపోతాయని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. రోజూ కనీసం 20 గోవులు చికిత్స కోసం ఇక్కడకు వస్తుంటాయని నిర్వహకుడు తెలిపారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మ్యూజిక్ థెరపీ వల్ల గోవులు బతికే అవకాశం 50 నుంచి 60 శాతానికి పెరిగిందట. యజమానులు భారమనుకుని వదిలేస్తున్న ఎన్నో గోవులకు తాము ఆశ్రయమిస్తున్నామని కూడా చెప్పారు.


ఇందుకు సంబంధించిన నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ వేణుగానం వినిస్తుంటే చుట్టూ ఉన్న ఆవులు, లేగదూడలు ఆసక్తిగా విన్నాయి. మరికొన్ని లేగదూడలు ఆమె చుట్టూ చేరి సంగీతాన్ని ఆస్వాదించాయి. ఈ దృశ్యాలు నెటిజన్లను కూడా ఆకర్షించడంతో సంగీతానికున్న గొప్పదనంపై ప్రశంసల జల్లు కురిసింది. ఈ మహత్తును తాము స్వయంగా చూశామంటూ అనేక మంది తమ స్వానుభవాలను పంచుకున్నారు.

Read Viral and Telugu News

Updated Date - Jul 27 , 2024 | 07:19 PM

Advertising
Advertising
<