ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Private Jets: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జెట్ విమానాలు కలిగి ఉన్న.. ఆ ఆరుగురు ఎవరో తెలుసా..

ABN, Publish Date - Jan 09 , 2024 | 06:41 PM

విమాన ప్రయాణం అంటే ఎవరికైనా ఆసక్తి ఉంటుంది. అయితే ఇది ఖర్చుతో కూడుకున్నది కావడంతో చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. అయితే కొందరు మాత్రం ఖర్చుకు వెనుకాడకుండా తమ కోరికలు తీర్చుకుంటుంటారు. మరికొందరు ...

విమాన ప్రయాణం అంటే ఎవరికైనా ఆసక్తి ఉంటుంది. అయితే ఇది ఖర్చుతో కూడుకున్నది కావడంతో చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. అయితే కొందరు మాత్రం ఖర్చుకు వెనుకాడకుండా తమ కోరికలు తీర్చుకుంటుంటారు. మరికొందరు ధనవంతులు ఎక్కడికి రాకపోకలు సాగించాలన్నా విమానంలో వెళ్తుంటారు. మరికొందరు కుబేరులు తామే సొంత విమానాలను కలిగి ఉంటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సొంత జెట్ విమానాలు కొంతమంది వద్ద మాత్రమే ఉన్నాయి. ఆ కుబెరులెవరో ఇప్పుడు తెలుసుకుందాం..

1.హాంకాంగ్ బిలియనీర్ జోసెఫ్ లా

చైనాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త అయిన జోసెఫ్ లా.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెండో జెట్ విమానాన్ని కలిగి ఉన్నారు. ఈయన 367 మిలియన్ డాలర్లు ఖర్చు చేసి బోయింగ్ 747-8 VIP అనే విమానాన్ని కొన్నారు. ఇందులో అత్యంత అధునాతన సౌకర్యాలు ఉంటాయట. ఈ జెట్ మాక్ 0.855 వేగంతో 8,000 నాటికల్ మైళ్ల వరకు ఎగరగలదు. ఇది ధ్వని వేగానికి దగ్గరగా ఉంటుందట. అలాగే ఈ విమానంలో మాస్టర్ బెడ్‌రూమ్, లాంజ్, ఆఫీసు, డైనింగ్ రూమ్ తదితర సౌకర్యాలు ఉన్నాయి.

2.అలిషర్ ఉమనోవ్

రష్యన్ బిలియనీర్, మెటలో ఇన్వెస్ట్ అనే మైనింగ్ కంపెనీ యజమాని అయిన అలిషర్ ఉమనోచ్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జెట్ విమానం ఉంది. ఈయన A340-300 అనే ఎయిర్‌బస్‌ని 250 మిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశారు. ఈ విమానం 375 మంది ప్రయాణికులను తీసుకువెళ్లగలిగే సామర్థం కలిగి ఉంది. అలాగే ఇందులో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థతో పాటూ విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. ఈ జెట్ రష్యాలోనే కాకుండా యూరప్ మొత్తంలోనే అతిపెద్ద ప్రైవేట్ జెట్ అని చెబుతున్నారు.

3.హసనల్ బొల్కియా

బ్రూనై దేశ సుల్తాన్‌గా పిలవబడే బిలియనీర్ హసనల్ బొల్కియా వద్ద కూడా అత్యంత ఖరీదు చేసే విమానం ఉంది. ఈయన 747-430 బోయింగ్ విమానాన్ని 230 మిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశారు. ఈ జెట్‌ లోపల ఇంటీరియర్ మొత్తం బంగారు రంగుతో తీర్చిదిద్దారు. అలాగే ఫర్నీచర్, వాష్ బేసిన్ తదితరాలకూ బంగారు పూత ఉంటుంది. ఈ విమానంలో అత్యంత విలాసవంతమైన లివింగ్ రూమ్, బెడ్‌రూమ్, బాత్రూం తదితరాలు ఉన్నాయి.


4.రోమన్ అబ్రమోవిచ్

రష్యన్ బిలియనీర్, చెల్సియా ఫుట్‌బాల్ క్లబ్ యజమాని రోమన్ అబ్రమోవిచ్ వద్ద కూడా విలాసవంతమైన జెట్ విమానం ఉంది. ఈయన 170 మిలియన్ డాలర్లు వెచ్చించి.. బోయింగ్ 757 విమానాన్ని కొనుగోలు చేశారు. అలాగే ఈయన తన జెట్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి 270 మిలియన్ డాలర్లు వెచ్చించాడు. ఈ విమానానికి ఆయన బండిట్ అని పేరు పెట్టాడు. ఇందులో మాస్టర్ బెడ్‌రూమ్, డైనింగ్ రూమ్, కిచెన్ తదితర అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. అలాగే ఈ విమానానికి బుల్లెట్ ఫ్రూప్ విండోలను కూడా ఏర్పాటు చేశారు.

5.కిమ్ కర్దాషియాన్

అమెరికన్ వ్యాపారవేత్త అయిన కిమ్ కర్దాషియాన్ లగ్జరీ విషయంలో తగ్గేదే లేదు అన్నట్లుగా ఉంది. ఈమె గల్ఫ్‌స్ట్రీమ్ G650ER అనే ఖరీదైన విమానాన్ని.. 150 మిలియన్ డాలర్ల విమానాన్ని కొనుగోలు చేశారు. ఈ విమానం ప్రపంచంలోనే అత్యంత వేగమైన, విలాసవంతమైన జెట్‌ అని తెలిసింది. ఇది మాక్ 0.925 వేగంతో పాటూ 7,500 నాటికల్ మైళ్ల వరకు ఎగరగలదు. ఈమె తన విమానాన్ని ఆధునికీకరించడానికి 150 మిలియన్ డాలర్లు వెచ్చించింది. ఈ విమానాన్ని కిమ్ ఎయిర్ అని పిలుస్తారు.

6.డోనాల్డ్ ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రముఖ వ్యాపారవేత్త అయిన డోనాల్డ్ ట్రంప్ వద్ద అత్యంత ఖరీదు చేసే బోయింగ్ 757 విమానం ఉంది. ఈ జెట్ విమానాన్ని ట్రంప్ 100 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాడు. ఈ జెట్‌కు ట్రంప్ ఫోర్స్ వన్ అని పేరు పెట్టారు. ఈ విమానంలోనూ బంగారు పూతతో కూడిన బాత్రూమ్, డైనింగ్ రూమ్ తదితరాలు ఉన్నాయి. ఇందులో హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్, శాటిలైట్ ఫోన్, వీడియో కాన్ఫరెన్సింగ్ సిస్టమ్ తదితర అత్యాధునిక సౌకర్యాలు కూడా ఉన్నాయి.

Updated Date - Jan 09 , 2024 | 06:41 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising