Viral Video: బైక్ ఎక్కిన అమ్మాయికి చుక్కలు చూపించాడు.. స్టంట్ చేద్దామనుకుంటే ఇలా రివర్స్ అయిందేంటి..!
ABN, Publish Date - Aug 26 , 2024 | 09:34 PM
సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో కొందరు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. వ్యూస్, లైక్స్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా యువత ప్రాణంతక బైక్ స్టంట్స్ చేస్తూ వాటిని రికార్డ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో వారు ప్రమాదాల బారిన పడుతున్నారు.
సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో కొందరు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. వ్యూస్, లైక్స్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా యువత ప్రాణంతక బైక్ స్టంట్స్ (Bike Stunts) చేస్తూ వాటిని రికార్డ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో వారు ప్రమాదాల బారిన పడడమే కాకుండా ఇతరులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఓ కుర్రాడు తనను నమ్మి బైక్ ఎక్కిన అమ్మాయికి చుక్కలు చూపించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది (Viral Video).
wb_rider_sayan అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ అబ్బాయి, అమ్మాయి బ్లాక్ డ్రెస్‌లు ధరించి బిజీ రోడ్డుపై బైక్ మీద వెళ్తున్నారు. పక్క నుంచి స్నేహితుడు వీడియో తీస్తుండగా బైక్ నడుపుతున్న ఆ కుర్రాడు ముందు చక్రాన్ని గాల్లోకి లేపడానికి ప్రయత్నించాడు. దీంతో వెనుక కూర్చున్న అమ్మాయి సీటు నుంచి జారిపోయి వెనుక చక్రం మీదకు వెళ్లిపోయింది. గట్టిగా కేకలు పెట్టాడు. వెంటనే ఆ కుర్రాడు బైక్ ఆపేశాడు. వెనుకే వచ్చిన కారు కూడా ఆగింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వైరల్ వీడియోకు సోషల్ మీడియాలో కోటికి పైగా వ్యూస్ వచ్చాయి. 13 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది సరికొత్త బ్రేక్ సిస్టమ్``, ``ఇలాగే జరగాలి``, ``అద్భుతమైన ప్రదర్శన``, ``ఆ అమ్మాయి ఎప్పుడూ అతడి బైక్ ఎక్కదు``, ``ఇది నిజంగా నిర్లక్ష్యం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: నాగుపాము పడగ విప్పితే.. పెద్ద పులి అయినా తోకముడవాల్సిందే.. వీడియో వైరల్!
Viral: ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే జిలేబీ తెమ్మన్నారు.. అసలు కథ ఏంటంటే..!
Optical Illusion: మీ కళ్ల సామర్థ్యానికి పరీక్ష.. ఈ ఫొటోలో భిన్నంగా ఉన్న కుక్క ఎమోజీని కనిపెట్టండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 26 , 2024 | 09:34 PM