ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Shocking: అమ్మాయిలూ.. జాగ్రత్త! హెయిర్ స్ట్రెయిటనింగ్ కోసం సెలూ‌న్‌కు వెళ్లితే కిడ్నీలు పాడయ్యాయి.. ఎందుకంటే..

ABN, Publish Date - Mar 29 , 2024 | 03:16 PM

చాలా మంది అమ్మాయిలు తమ జుత్తును తమకు నచ్చినట్టుగా మార్చుకునేందుకు ఇష్టపడుతున్నారు. రకరకాల క్రీములు రాసి, మెషిన్లు ఉపయోగించి జుట్టు తీరును మార్చుకుంటున్నారు.

ప్రస్తుత సమాజంలో అమ్మాయిలకు అందం (Beauty) మీద విపరీతంగా శ్రద్ధ పెరిగిపోయింది. చాలా మంది అమ్మాయిలు బ్యూటీపార్లర్లకు, సెలూన్లకు వెళ్లి తమ అందానికి మెరుగులు దిద్దుకుంటున్నారు. ముఖ్యంగా జుత్తును (Hair) తమకు నచ్చినట్టుగా మార్చుకునేందుకు ఇష్టపడుతున్నారు. రకరకాల క్రీములు రాసి, మెషిన్లు ఉపయోగించి జుట్టు తీరును మార్చుకుంటున్నారు. అలా హెయిర్ స్ట్రెయిటనింగ్ (Hair Straightening) కోసం సెలూన్‌కు (Saloon) వెళ్లిన ఓ మహిళ తీవ్ర అనారోగ్యం బారిన పడింది. ఏకంగా ఆమె రెండు కిడ్నీలు పాడైపోయాయి.

న్యూ ఇంగ్లండ్ జర్నల్ అఫ్ మెడిసన్ ప్రకారం.. 26 ఏళ్ల మహిళ తన జుట్టు స్ట్రెయిటనింగ్ కోసం తొలిసారిగా 2020 జూన్‌లో సెలూన్‌కు వెళ్లింది. తర్వాత 2021, 2022లో కూడా అదే సెలూన్‌కు వెళ్లి హెయిర్ స్ట్రెయిటనింగ్ చేయించుకుంది. ఆమె సెలూన్‌కు వెళ్లి వచ్చిన ప్రతిసారీ వాంతులు, విరేచనాలు, జ్వరం, వెన్నునొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడేది. ఆ తర్వాత ఆ సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. దీర్ఘకాల సమస్యలుగా మారాయి. దీంతో ఆమె డాక్టర్లను సంప్రదించింది. ఆమెకు రక్త పరీక్షలు చేయించిన వైద్యులు ఆమె రక్తంలో క్రియాటినిన్ ఎక్కువగా ఉన్నట్టు తెలుసుకున్నారు. సీటీ స్కాన్ చేసి ఆమె మూత్ర పిండాలు (Kidneys) సరిగ్గా పని చేయడం లేదని గుర్తించారు (kidney damage). అలా ఎందుకు జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నంలో షాకింగ్ విషయం కనుగొన్నారు.

ఆమె హెయిర్ స్ట్రెయిటనింగ్‌ కోసం సెలూన్‌కు వెళ్లినప్పుడల్లా ఉపయోగించే క్రీమ్‌లో 10 శాతం గ్లైక్సిలిక్ యాసిడ్ (Glyoxylic Acid) అనే రసాయనం ఉన్నట్టు గుర్తించారు. ఈ గ్లైక్సిలిక్ యాసిడ్‌కు కిడ్నీ వైఫల్యానికి మధ్య సంబంధం ఉందని తెలుసుకున్నారు. సెలూన్‌లో ఉపయోగించిన గ్లైక్సిలిక్ యాసిడ్‌‌ను ఐదు ఎలుకలపై ప్రయోగించారు. ఆ ఎలుకల మూత్రంలో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఆ యువతి మూత్రపిండాలు చెడిపోవడానికి ఈ క్రీమ్ కారణమని కనుగొన్నారు. ఆమె తలకు రాసిన క్రీమును చర్మం శోషించుకుంది. ఆ ప్రమాదకర కెమికల్ శరీరంలోని మూత్రపిండాలకు చేరుకుని వాటిపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది.

ఇవి కూడా చదవండి..

Viral Video: వెనక్కి వెళుతున్న బస్సు.. డ్రైవర్‌‌కు ఆంటీ ఫన్నీ ప్రశ్న.. వైరల్ అవుతున్న వీడియో!

Viral Video: బ్రెయిన్ ఉపయోగిస్తే స్ట్రెయిన్ తగ్గుతుంది.. ఈమె పూరీలను ఎంత సింపుల్‌గా చేసేస్తోందో చూడండి..

Updated Date - Mar 29 , 2024 | 03:18 PM

Advertising
Advertising