Share News

Viral Video: బ్రెయిన్ ఉపయోగిస్తే స్ట్రెయిన్ తగ్గుతుంది.. ఈమె పూరీలను ఎంత సింపుల్‌గా చేసేస్తోందో చూడండి..

ABN , Publish Date - Mar 27 , 2024 | 02:57 PM

పెద్దగా శ్రమ పడకుండా పూరీలు వేయించడం ఎలా అనేది ఓ వీడియోలో ఓ మహిళ చూపించింది. ఆ వీడియో ఎంతో మందిని ఆకట్టుకుంటోంది.

Viral Video: బ్రెయిన్ ఉపయోగిస్తే స్ట్రెయిన్ తగ్గుతుంది.. ఈమె పూరీలను ఎంత సింపుల్‌గా చేసేస్తోందో చూడండి..

బ్రెయిన్ ఉపయోగిస్తే స్ట్రెయిన్ తగ్గుతుంది.. ఇదేదో సినిమా డైలాగ్ కాదు. ఎంతో మంది నిజ జీవితంలో దీనిని రుజువు చేసి అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు (Jugaad Video) ఎంతో మందిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది. పెద్దగా శ్రమ పడకుండా పూరీలు (Poori) వేయించడం ఎలా అనేది ఆ వీడియోలో ఓ మహిళ చూపించింది (Viral Video).

ఇంట్లో చపాతీలు, పూరీలు చేసేందుకు గృహిణులు చాలా కష్టపడుతుంటారు. ఎందుకంటే వాటిని వత్తడం కష్టంతో కూడుకున్న పని. అలాగే చాలా ఎక్కువ సమయం పడుతుంది. దీంతో చాలా మంది వాటి జోలికి వెళ్లరు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ మహిళ పూరీలను సులభంగా వత్తేసే ట్రిక్ ఒకటి చూపించింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో మహిళ 5 పిండి ముద్దలను ప్లాస్టిక్ కవర్‌పై పెట్టింది. తర్వాత వాటిని కవర్ మరో సగ భాగంతో మూసేసింది. ఆ తర్వాత ఒక్కో పిండి ముద్దపై బోర్డ్‌తో గట్టిగా నొక్కింది. దీంతో అవి గుండ్రని పూరీల్లా మారిపోయాయి (Simple Trick).

అలా సులభంగా వత్తేసుకుని వాటిని వేయించుకుంటే సరిపోతుంది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 50 లక్షల మందికి పైగా వీక్షించారు. 95 వేల మందికి పైగా లైక చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``నేనూ ఇలా ప్రయత్నిస్తా``, ``చాలా సమయం, శ్రమ ఆదా అవుతుంది``, ``అద్భుతమైన ఆలోచన.. టైమ్ వేస్ట్ అవదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: వందల కోట్ల ఆస్తి.. కుమారుడికి చెప్పకుండా దాచిన తండ్రి.. అసలు కథేంటో తెలిస్తే షాక్ అవక తప్పదు!

Puzzle: మీ కళ్లు ఎంత ఫవర్‌ఫుల్‌గా ఉన్నాయో టెస్ట్ చేసుకోండి?.. ఈ ఫొటోలో సూది ఎక్కడుందో కనిపెట్టండి..!

Updated Date - Mar 27 , 2024 | 02:58 PM