Share News

Viral: వందల కోట్ల ఆస్తి.. కుమారుడికి చెప్పకుండా దాచిన తండ్రి.. అసలు కథేంటో తెలిస్తే షాక్ అవక తప్పదు!

ABN , Publish Date - Mar 26 , 2024 | 10:00 PM

ఏ తండ్రి అయినా తన పిల్లలు ఎంతో సంతోషంగా, సౌకర్యవంతంగా పెరగాలని కోరుకుంటాడు. అందుకోసం ఎంత కష్టపడి అయినా అన్నీ అమరుస్తాడు. ఇక, ధనవంతులు అయితే తమ పిల్లల్ని డబ్బులు ముంచేస్తుంటారు.

Viral: వందల కోట్ల ఆస్తి.. కుమారుడికి చెప్పకుండా దాచిన తండ్రి.. అసలు కథేంటో తెలిస్తే షాక్ అవక తప్పదు!

ఏ తండ్రి (Father) అయినా తన పిల్లలు ఎంతో సంతోషంగా, సౌకర్యవంతంగా పెరగాలని కోరుకుంటాడు. అందుకోసం ఎంత కష్టపడి అయినా అన్నీ అమరుస్తాడు. ఇక, ధనవంతులు అయితే తమ పిల్లల్ని డబ్బులు ముంచేస్తుంటారు. కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు. అడిగినవన్నీ తెచ్చిస్తుంటారు. అయితే చైనా (China)కు చెందిన ఓ తండ్రి మాత్రం చాలా విభిన్నంగా ఆలోచించాడు. మల్టీ మిలియనీర్ అయ్యుండీ తన కొడుక్కి అబద్ధం చెప్పాడు. చైనాకు చెందిన ప్రముఖ ``మాలా ప్రిన్స్`` (Mala Prince) బ్రాండ్ అధిపతి జాంగ్ యుడాంగ్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral News) అవుతోంది.

జాంగ్ యుడాంగ్ నిర్వహిస్తున్న ``మాలా ప్రిన్స్`` బ్రాండ్ వ్యాపారం విలువ రూ.690 కోట్లు. అయితే యుడాంగ్ కుమారుడు జాంగ్ జిలాంగ్‌ (Zhang Zilong)కు మాత్రం తన కుటుంబ ఐశ్వర్యం గురించి తెలియదు. ``నాకు 20 ఏళ్లు వచ్చే వరకు మా కుటుంబ వాస్తవ పరిస్థితి గురించి తెలియదు. వ్యాపారం నష్టాల్లోనే ఉందని నాన్న ఎప్పుడూ చెప్పేవాడు. పింగ్‌జియాంగ్‌లోని ఓ సాధారణ ఇంట్లోనే మేం ఉండేవాళ్లం. నా చదువు కూడా సాధారణ స్కూల్లోనే సాగింది. గ్రాడ్యుయేషన్ కోసం అప్పులు కూడా చేశా. అవి తీర్చేందుకు ఉద్యోగంలో చేరాలనుకున్నా. ఆ సమయంలోనే మా నాన్న మా ఆస్తి గురించి బయటపెట్టార``ని జిలాంగ్ తెలిపాడు.

``ఆ రహస్యం బయటపడిన తర్వాతే మేం రూ.11 కోట్ల ఖరీదు చేసే విల్లాలోకి మారాం. ఒక సాధారణ వ్యక్తిగా పెరిగితేనే జీవితంలో విజయం సాధించాలనే కసి పెరుగుతుందని మా నాన్న అభిప్రాయం. అందుకే నన్ను అలా పెంచారు. ఇప్పుడు నేను మా కంపెనీ ఈ-కామర్స్ విభాగంలో పని చేస్తున్నా. నా పనితీరు నచ్చితేనే సంస్థ బాధ్యతలు అప్పగించడం గురించి ఆలోచిస్తానని నాన్న చెప్పార``ని జిలాంగ్ తెలిపాడు. ప్రస్తుతం జిలాంగ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి..

Viral Video: ధోనీ పైలెట్ కూడా అయ్యాడా? ఏంటి? వైరల్ వీడియో చూసి అయోమయంలో ఫ్యాన్స్!

Puzzle: మీ కళ్లు ఎంత ఫవర్‌ఫుల్‌గా ఉన్నాయో టెస్ట్ చేసుకోండి?.. ఈ ఫొటోలో సూది ఎక్కడుందో కనిపెట్టండి..!

Updated Date - Mar 26 , 2024 | 10:00 PM