Share News

Viral Video: ధోనీ పైలెట్ కూడా అయ్యాడా? ఏంటి? వైరల్ వీడియో చూసి అయోమయంలో ఫ్యాన్స్!

ABN , Publish Date - Mar 26 , 2024 | 04:18 PM

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. ఆ ఏడుగురిలో ఏ ఒక్కరు సెలబ్రిటీ అయినా మిగలిన వారు కూడా చిన్న సైజు సెలబ్రిటీలు అయిపోతారు.

Viral Video: ధోనీ పైలెట్ కూడా అయ్యాడా? ఏంటి? వైరల్ వీడియో చూసి అయోమయంలో ఫ్యాన్స్!

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. ఆ ఏడుగురిలో ఏ ఒక్కరు సెలబ్రిటీ అయినా మిగలిన వారు కూడా చిన్న సైజు సెలబ్రిటీలు అయిపోతారు. ప్రధాని మోదీ లాంటి వ్యక్తి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తులు తమ తమ ఏరియాల్లో చాలా పాపులర్. తాజాగా ధోనీలాంటి (MS Dhoni) వ్యక్తికి సంబంధించిన ఓ వీడియో వైరల్ (Viral Video) అవుతోంది. చూడడానికి అచ్చం ధోనీలాగానే (Dhoni Lookalike) ఉన్న ఆ వ్యక్తి ఓ విమాన పైలెట్ (Pilot).

viralbhayani అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ధోనీని పోలిన ఓ వ్యక్తి పైలెట్ డ్రెస్‌లో ఉన్నాడు. ఎయిర్‌హోస్టెస్‌తో మాట్లాడిన తర్వాత కాక్‌పిట్‌లోకి వెళ్లిపోయాడు. ఆ వ్యక్తి చాలా వరకు ధోనీ రూపురేఖలతోనే ఉన్నాడు. అలాగే విమానంలో పైలట్ ప్రకటన సమయంలో, అతని వాయిస్ కూడా ధోనీని పోలి ఉంది. ఆ సమయంలో ఓ వ్యక్తి ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో చూసిన వారు అయోమయానికి గురవుతున్నారు.

Viral Video: వామ్మో.. కోడికి ఇంత పవర్ ఉంటుందా? గాల్లో ఎంత దూరం ఎగిరిందో చూడండి..

ఈ వైరల్ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 1.4 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ధోనీ భాయ్‌కు ఈ ట్యాలెంట్ కూడా ఉందా``, ``జాగ్రత్త.. ధోనీ మంచి ఫినిషర్``, `` కెప్టెన్ కూల్ కూడా విమానం నడపగలడా..?``, ``చాలా వరకు ధోనీలానే ఉన్నాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Mar 26 , 2024 | 04:19 PM