Share News

Viral Video: వామ్మో.. కోడికి ఇంత పవర్ ఉంటుందా? గాల్లో ఎంత దూరం ఎగిరిందో చూడండి..

ABN , Publish Date - Mar 25 , 2024 | 08:44 PM

కోళ్లు పక్షి జాతికి చెందినవే అయినా, బరువు ఎక్కువగా ఉండడం వల్ల అవి ఎగరలేవు. ఒకవేళ ఎగిరినా కొన్ని అడుగులు మాత్రమే ప్రయాణించగలవు.

Viral Video: వామ్మో.. కోడికి ఇంత పవర్ ఉంటుందా? గాల్లో ఎంత దూరం ఎగిరిందో చూడండి..

కోళ్లు (Hen) పక్షి జాతికి చెందినవే అయినా, బరువు ఎక్కువగా ఉండడం వల్ల అవి ఎగరలేవు. ఒకవేళ ఎగిరినా కొన్ని అడుగులు మాత్రమే ప్రయాణించగలవు. అయితే ఆ అభిప్రాయం తప్పని తాజాగా ఓ కోడి నిరూపించింది. ఆ కోడి గాల్లో చాలా దూరం ఎగిరి వెళ్లింది (Hen Flying). ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది. ఆ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

@AmazingNature అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ నది ఒడ్డున కోళ్ల గుంపు ఉంది. అందులో ఓ కోడి హఠాత్తుగా ఎగరడం ప్రారంభించింది. ఆ కోడి నదిలో పడిపోతుందేమోనని అనుకుంటే.. అది అతి వేగంగా ఎగురుతూ అవతలి ఒడ్డుకు చేరుకుంది. దాదాపు అర కిలోమీటర్ దూరం ఆ కోడి పెట్ట ఎగరగలిగింది. ఆ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది.

Viral Video: వేడికి తట్టుకోలేక మడుగులోకి దిగిన పులి.. రెడ్ బాల్‌పై ఎలా విశ్రాంతి తీసుకుంటోందో చూడండి..

ఈ వైరల్ వీడియోకు లక్షల్లో వ్యూస్ లభించాయి. చాలా మంది ఈ వీడియో చూసి ఆశ్చర్యపోయారు. ఈ వీడియోపై తమ స్పందనలను తెలియజేశారు. ``కోళ్లు ఎగరగలవు, ఈత కొట్టగలవు``, ``కోడి ఇంత దూరం ఎగరడం నేను చూడలేదు``, ``కోళ్లు ఉన్న చోటు నుంచి పైకి ఎగురతాయి, ఇది విచిత్రంగా ఉంది``, ``ఆ కోడి ఎందుకు నది దాటాలనుకుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Mar 25 , 2024 | 08:44 PM