Share News

Viral Video: వేడికి తట్టుకోలేక మడుగులోకి దిగిన పులి.. రెడ్ బాల్‌పై ఎలా విశ్రాంతి తీసుకుంటోందో చూడండి..

ABN , Publish Date - Mar 25 , 2024 | 08:28 PM

మనుషుల్లాగానే జంతువులు కూడా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. చలి కాలంలో ఎండలోనే ఎక్కువ సమయం గడుపుతాయి. ఎండలు మండిపోతుంటే చల్లటి ప్రదేశాల కోసం అన్వేషిస్తుంటాయి.

Viral Video: వేడికి తట్టుకోలేక మడుగులోకి దిగిన పులి.. రెడ్ బాల్‌పై ఎలా విశ్రాంతి తీసుకుంటోందో చూడండి..

మనుషుల్లాగానే జంతువులు కూడా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. చలి కాలంలో ఎండలోనే ఎక్కువ సమయం గడుపుతాయి. ఎండలు మండిపోతుంటే చల్లటి ప్రదేశాల కోసం అన్వేషిస్తుంటాయి. కొలను, మడుగుల్లో సేద తీరుతుంటాయి. ప్రస్తుతం అలా సేద తీరుతున్న ఓ పులికి (Tiger) సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. ఆ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పులి మడుగులోకి దిగి ఓ బాల్‌పై తన ముందరి కాళ్లను ఉంచి రెస్ట్ తీసుకుంటోంది. ఆ పులి ముఖ కవళికలు గమనిస్తే అది ఎంత హాయిగా ఉందో అర్థమవుతుంది. తన పాదాలతో బంతిని పట్టుకుని, దానిపై తన తలని ఉంచింది. బంతి జారిపోతుంటే తిరిగి పట్టుకుంటోంది. ఈ వీడియోను థాయ్‌లాండ్‌లోని (Thailand) అభయారణ్యంలో చిత్రీకరించారు. Wildlife friends foundation అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది.

Puzzle: మీ బ్రెయిన్ ఎంత షార్ప్‌గా ఉందో టెస్ట్ చేసుకోండి?.. ఈ ఫొటోలో నిజమైన కుక్క పిల్ల ఏదో కనిపెట్టండి..!

ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుని వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు కోట్ల మంది వీక్షించారు. 69 లక్షల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ పులి ఎంతో సుఖాన్ని అనుభవిస్తోంది``, ``ఎన్ని కోట్లు ఇచ్చినా అలాంటి స్థితి రాదు``, ``ఆ పులి మెడిటేషన్ చేస్తోంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Mar 25 , 2024 | 08:29 PM