Share News

Viral: మరీ ఇంత ట్యాలెంటెడ్‌గా ఉన్నారేంట్రా.. వంట చేసేటపుడు గ్యాస్ అయిపోతే వాటర్ హీటర్‌తో కానిచ్చేశాడు..!

ABN , Publish Date - Mar 26 , 2024 | 04:50 PM

వంట చేస్తున్నప్పుడు గ్యాస్ అయిపోవడం అనేది చాలా మందికి అనుభవంలోకి వచ్చే విషయమే. ఇంట్లో రెండో సిలిండర్ లేకపోతే వంట చేయడం చాలా కష్టమవుతుంది.

Viral: మరీ ఇంత ట్యాలెంటెడ్‌గా ఉన్నారేంట్రా.. వంట చేసేటపుడు గ్యాస్ అయిపోతే వాటర్ హీటర్‌తో కానిచ్చేశాడు..!

వంట చేస్తున్నప్పుడు గ్యాస్ (Gas) అయిపోవడం అనేది చాలా మందికి అనుభవంలోకి వచ్చే విషయమే. ఇంట్లో రెండో సిలిండర్ (Gas Cylinder) లేకపోతే వంట చేయడం చాలా కష్టమవుతుంది. అయితే ఉపాయం ఉన్న వాడు ఎంత పెద్ద ఉపాయాన్నైనా చాలా సులభంగా ఎదుర్కొంటాడు. ఎంత పెద్ద సమస్యకైనా సులభమైన పరిష్కారాలను కనుగొనే వారికి భారతదేశంలో కొదవ లేదు. తాజాగా అలాంటి ట్రిక్ (Trick) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి వంట చేస్తుండగా గ్యాస్ అయిపోయింది. అయినా అతడు ఏమీ టెన్షన్ పడలేదు. చక్కగా వాటర్ హీటర్ (Water Heater) ఆన్ చేసి ఆ రాడ్‌ను పాత్రలో పెట్టాడు. వాటర్ హీటర్ నుంచి వచ్చిన వేడి కారణంగా ఆ కూర చక్కగా ఉడికిపోయింది. ఇది నిజంగా గొప్ప ఆలోచన అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: ధోనీ పైలెట్ కూడా అయ్యాడా? ఏంటి? వైరల్ వీడియో చూసి అయోమయంలో ఫ్యాన్స్!

ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఈ వీడియోపై ఫన్నీ కామెంట్లు చేశారు. ``ఇతను చాలా పరిజ్ఞానం కలిగిన వ్యక్తి``, ``నేను కూడా ట్రై చేస్తా``, ``ఈ టెక్నాలజీ భారతదేశం దాటి వెళ్లకూడదు``, ``అద్భుతమైన ఆలోచన`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Mar 26 , 2024 | 04:50 PM