Share News

Viral Video: వెనక్కి వెళుతున్న బస్సు.. డ్రైవర్‌‌కు ఆంటీ ఫన్నీ ప్రశ్న.. వైరల్ అవుతున్న వీడియో!

ABN , Publish Date - Mar 27 , 2024 | 03:34 PM

గుజరాత్‌లోని ఎత్తైన ప్రదేశం అయిన కాలా దుంగార్‌ను ``ది బ్లాక్ హిల్స్`` అని పిలుస్తారు. ఈ కొండ ఎత్తు 465 మీటర్లు. ఈ కొండపై 400 సంవత్సరాల పురాతన దత్తాత్రేయ దేవాలయం ఉంది.

Viral Video: వెనక్కి వెళుతున్న బస్సు.. డ్రైవర్‌‌కు ఆంటీ ఫన్నీ ప్రశ్న.. వైరల్ అవుతున్న వీడియో!

గుజరాత్‌ (Gujarat)లోని ఎత్తైన ప్రదేశం అయిన కాలా దుంగార్‌ (Kala Dungar)ను ``ది బ్లాక్ హిల్స్`` అని పిలుస్తారు. ఈ కొండ ఎత్తు 465 మీటర్లు. ఈ కొండపై 400 సంవత్సరాల పురాతన దత్తాత్రేయ దేవాలయం ఉంది. చుట్టూ పెద్ద కొండలు, అందమైన దృశ్యాలతో కనులవిందు చేస్తుంది. అయితే అక్కడికి చేరుకోవడం అంత సులభం కాదు. ఆ కొండ పైకి చాలా నిటారుగా ఎక్కాలి. ఎంతో అనుభవం ఉన్న డ్రైవర్లే బస్సులను (Bus Driver) ఆ కొండ పైకి తీసుకెళ్లగలరు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.

creative_prats అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో బస్సు డ్రైవర్ కాలా దుంగార్ వైపు బస్సును తీసుకెళ్తున్నాడు. మార్గ మధ్యంలో ఆ బస్సును నిలిపినపుడు, దానంతట అదే వెనక్కి వెళ్లిపోతోంది. ఆ డ్రైవర్ కేవంల బ్రేక్‌ల సహాయంతో మాత్రమే బస్సును నియంత్రిస్తున్నాడు. ప్యాసింజర్ సీట్లో కూర్చున్న మహిళ ఆ డ్రైవింగ్ చూసి ఆశ్చర్యపోయింది. ``మనం కూడా ఈ రోడ్డు మీద నిలబడితే ఇలాగే వెనక్కి వెళ్లిపోతామా?`` అంటూ ఫన్నీగా అడిగింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను ఇప్పటివరకు 1.5 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందలను తెలియజేశారు. ``భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు ఉత్తరాన 40 కిలోమీటర్ల దూరంలో ఉంది``, ``ఆంటీ ప్రశ్న చాలా ఫన్నీగా ఉంది``, ``ఆ ప్రాంతం నిజంగా చాలా బాగుంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: మరీ ఇంత ట్యాలెంటెడ్‌గా ఉన్నారేంట్రా.. వంట చేసేటపుడు గ్యాస్ అయిపోతే వాటర్ హీటర్‌తో కానిచ్చేశాడు..!

Viral Video: ధోనీ పైలెట్ కూడా అయ్యాడా? ఏంటి? వైరల్ వీడియో చూసి అయోమయంలో ఫ్యాన్స్!

Updated Date - Mar 27 , 2024 | 03:34 PM