భూపాలపల్లి ఈద్గా మైదానంలో ముస్లింల ప్రత్యేక ప్రార్థనల దృష్యాలు..
ABN, Publish Date - Apr 11 , 2024 | 01:31 PM
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా భూపాలపల్లి ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేసి.. పండుగ చేసుకుంటున్నారు. నిన్న (బుధవారం) నెలవొంక కనిపించడంతో ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటున్నారు. గత 30 రోజులుగా మండు వేసవిలో కఠోర ఉపవాస దీక్షలు విజయవంతగా పూర్తి చేసిన ముస్లింలు నెలవంకను చూసి సంబరాలు చేసుకుంటున్నారు. ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆలింగనం చేసుకుంటున్నారు.
పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న దృశ్యం.
రంజాన్ పర్వదినం సందర్బంగా భూపాలపల్లి ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆలింగనం చేసుకుంటున్న దృశ్యం.
పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ఓ ముస్లిం కుటుంబం సమాధి వద్ద పుష్పలు ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న దృశ్యం.
రంజాన్ పర్వదినం సందర్భంగా ఖిలా వరంగల్ ఈద్గాలో ముస్లిం సోదరులు ప్రార్ధనలు చేస్తున్న దృశ్యం.
హనుమకొండ బొక్కలగడ్డ ఈద్గా వద్ద రంజాన్ పర్వదినం సందర్భంగా పెద్ద ఎత్తున తరలి వచ్చిన ముస్లింలు ప్రార్థనలు చేస్తున్న దృశ్యం..
రంజాన్ పర్వదినం సందర్భంగా హనుమకొండ బొక్కలగడ్డ ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ఒకరికొకరు షేక్‌హ్యాడ్ ఇచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్న దృశ్యం.
Updated Date - Apr 11 , 2024 | 01:31 PM