నీలకంఠేశ్వరుని దర్శించుకున్న మహేష్ కుమార్ గౌడ్
ABN, Publish Date - Oct 22 , 2024 | 12:45 PM
నిజామాబాద్: జిల్లాలోని నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో తెలంగాణ పీసీపీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం ఆలయానికి వచ్చారు. దీపారాధన చేసిన తర్వాత నీలకంఠునికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం అర్చకులు మహేష్ కుమార్ గౌడ్‌కు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర ఆలయానికి వస్తున్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.. స్వామికి వస్త్రాలు, పూలు, పండ్లు తలపై పెట్టుకుని వస్తున్న దృశ్యం..
కుటుంబ సభ్యులతో కలిసి నీలకంఠేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహేష్ కుమార్ గౌడ్..
నీలకంఠేశ్వర దేవాలయంలో అన్నదానం చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్..
అమ్మవారి సన్నిధిలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్..
నీలకంఠేశ్వర స్వామి వార్లను దర్శించుకున్న అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మహేష్ కుమార్ గౌడ్..
Updated Date - Oct 22 , 2024 | 12:45 PM