ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Yadadri: యాదగిరిగుట్టపై వైభవంగా రథోత్సవం

ABN, Publish Date - Mar 20 , 2024 | 12:48 PM

ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి కల్యాణలక్ష్మీనరసింహుడు దివ్య విమానరథంలో తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చి తరింపజేశారు. జగత్‌ కల్యాణం..విశ్వశాంతి కోసం నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో దివ్యవిమాన రథోత్సవం శ్రీవైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో రాత్రి వేళ మూలమూర్తులకు మహానివేదనల అనంతరం వైభవంగా కొనసాగింది.

1/6

విశ్వక్సేనుడికి తొలి పూజలతో రథాంగ హోమం, రథాంగబలి, దిష్టికుంభ పూజలు నిర్వహించారు. పట్టువస్త్రాలు, బంగారు, వెండి, ముత్యాల ఆభరణాలతో నూతన కల్యాణ దంపతులైన లక్ష్మీ, నారసింహులను దివ్యమనోహరంగా అలంకరించిన దృశ్యం.

2/6

ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి కల్యాణలక్ష్మీనరసింహుడు దివ్య విమానరథంలో తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్న దృశ్యం.

3/6

స్వామివారి దివ్య విమాన రథోత్సవ పర్వాలను దేవస్థాన ప్రధానార్చకులు నల్లనథిఘళ్‌ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, అర్చకబృందం ఆధ్వర్యంలో సంప్రదాయరీతిలో నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ అనువంశీఖ ధర్మకర్త బీ నరసింహమూర్తి, ఈవో ఏ భాస్కర్‌రావు, దేవస్థాన సిబ్బంది, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్న దృశ్యం.

4/6

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం దివ్య విమాన రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న దృశ్యం.

5/6

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం దివ్య విమాన రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా కాళాకారులు డప్పులు వాయిస్తూ విన్యాసాలు చేస్తున్న దృశ్యం.

6/6

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి రథోత్సవంలో పాల్గొనేందుకు యాత్రాజనులు తండోపతండాలుగా తరలివచ్చిన దృశ్యం.

Updated Date - Mar 20 , 2024 | 12:48 PM

Advertising
Advertising