ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లియూతో సీఎం రేవంత్‌రెడ్డి
ABN, Publish Date - Oct 15 , 2024 | 02:06 PM
హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే కంపెనీలకు తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కరలేదన్నారు. సోమవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ (ఎఫ్‌ఐటీ) కంపెనీని ముఖ్యమంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఫాక్స్‌కాన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లియూతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కంపెనీ పురోగతి, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు.
కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీ సందర్శనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చములిచ్చి స్వాగతం పలుకుతున్న ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లియూ..
ఫాక్స్‌కాన్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయిన సీఎం రేంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు తదితరులు..మాట్లాడుతున్న చైర్మన్ యాంగ్ లియూ..
ఫాక్స్‌కాన్ కంపెనీ చైర్మన్ యాంగ్ లియూతో సీఎం రేంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు..
ఫాక్స్‌కాన్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం..
కొంగరకలాన్‌లో ఉన్న పాక్స్ కాన్ కంపెనీ ఛైర్మన్, సిబ్బందితో సీఎం రేవంత్ రెడ్డి బృందం..
Updated Date - Oct 15 , 2024 | 02:06 PM