తిరుపతిలో పవన్ కల్యాణ్ వారాహి డిక్లరేషన్ సభ
ABN, Publish Date - Oct 04 , 2024 | 11:39 AM
తిరుపతి: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని దీక్ష విరమించారు. ఈ సందర్బంగా గురువారం రాత్రి తిరుపతిలోని జ్యోతిరావు ఫూలే కూడలిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో ఆయన ప్రసంగించారు. సనాతన ధర్మాన్ని ఆరాదిస్తానని.. అన్ని మతాలను గౌరవిస్తానని స్పష్టం చేశారు. సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలని చూసేవారు ఎవరైనా సరే తుడిచిపెట్టుకుపోతారని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. దీనిపై బలమైన చట్టం రావాల్సి ఉందన్నారు.
ప్రాయశ్చిత్త దీక్ష విరమించిన అనంతరం గురువారం రాత్రి తిరుపతిలోని జ్యోతిరావు ఫూలే కూడలిలో వారాహి డిక్లరేషన్ సభలో ప్రసంగిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
వారాహి డిక్లరేషన్‌కు సంబంధించి ప్రసంగిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
తిరుపతిలోని జ్యోతిరావు ఫూలే కూడలిలో పవన్ కల్యాణ్ నిర్వహించిన సభలో ప్రజలకు వారాహి డిక్లరేషన్ చూపిస్తున్న దృశ్యం..
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూపొందించిన వారాహి డిక్లరేషన్ ఇదే..
తిరుపతిలోని జ్యోతిరావు ఫూలే కూడలిలో పవన్ కల్యాణ్ నిర్వహించిన వారాహి సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనం..
Updated Date - Oct 04 , 2024 | 11:39 AM