Happy New Year: తిరుమలలో భక్తుల రద్దీ
ABN, Publish Date - Jan 01 , 2024 | 09:09 AM
జనవరి ఒకటో తేదీ (న్యూ ఇయర్) సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శని, ఆది, సోమవారాలు వరుస సెలవులు రావడంతో శనివారం సాయంత్రం నుంచే తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. వైకుంఠద్వార దర్శనాలు కూడా సోమవారంతో ముగియనున్నాయి.
నూతన సంవత్సరం, వైకుంఠద్వార దర్శనాలు సోమవారంతో ముగియనుండడంతో తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకుని స్వామి ప్రసాదాలను ముందుంచుకుని భక్తులు గోవిందనామస్మరణ చేస్తున్న దృశ్యం.
కొత్త సంవత్సవరం సందర్భంగా భక్తులు తిరుమల శ్రీవారి ఆలయం ముందు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న దృశ్యం.
తిరుమలలో జరుగుతున్న న్యూ ఇయర్ వేడుకల్లో భక్తులు పాల్గొని.. గోవిందనామస్మరణ చేస్తున్న దృశ్యం.
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన భక్తులు.. రాత్రి షెడ్‌లో పడుకున్న దృశ్యం.
Updated Date - Jan 01 , 2024 | 09:09 AM