AP Capital: అమరావతి రాజధాని పనులు పున: ప్రారంభం
ABN, Publish Date - Oct 19 , 2024 | 04:45 PM
రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునః ప్రారంభానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. శనివారం రాయపూడిలో పూజలు నిర్వహించి పనులను సీఎం ప్రారంభించారు. 80 శాతం నిర్మాణం పూర్తి చేసుకున్న అమరావతి నిర్మాణ ఏజెన్సీ సీఆర్డీయే కార్యాలయ పనులను చంద్రబాబు మొదలుపెట్టారు.
అమరావతి రాజధాని నిర్మాణం 2.0 పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
రాయపూడిలో అమరావతి రాజధాని పనులు పున: ప్రారంభం
పూజలు నిర్వహించి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి
రాజధాని అమరావతి నిర్మాణ పనుల పున:ప్రారంభానికి సీఎం చంద్రబాబు శ్రీకారం
80 శాతం నిర్మాణం పూర్తి చేసుకున్న అమరావతి నిర్మాణ ఏజెన్సీ సీఆర్డీయే కార్యాలయ పనులను ప్రారంభించిన సీఎం
రూ.160 కోట్లతో 7 అంతస్తుల్లో 2018లో కార్యాలయ పనులను చేపట్టిన సీఆర్డీఏ
రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను అభినందించిన సీఎం. మహిళా రైతులు వీరోచితంగా పోరాడారని.. రాణి రుద్రమ కన్నా వీరోచితంగా పోరాడారని కొనియాడారు.
Updated Date - Oct 19 , 2024 | 04:50 PM