TDP: గుడివాడలో చంద్రబాబు ‘రా కదిలిరా’ సభ
ABN, Publish Date - Jan 19 , 2024 | 11:55 AM
కృష్ణాజిల్లా: తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 28వ వర్థంతి సందర్భంగా ఆయన సొంత నియోజకవర్గం గుడివాడ, మల్లాయిపాలెం వద్ద జరిగిన ‘రా కదిలిరా’ బహిరంగ సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సభను జనసేన పార్టీ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభాప్రాంగణం వద్ద భారీ స్వాగత ఫ్లెక్సీలు, పసుపు జెండాలతో అలంకరించారు.
కృష్ణాజిల్లా, గుడివాడ, మల్లాయిపాలెం వద్ద జరిగిన ‘రా కదిలిరా’ బహిరంగ సభలో పాల్గొనే ముందు నందమూరి ఎన్టీ రామారావు 28వ వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిస్తున్న దృశ్యం.
గుడివాడలో జరిగిన ‘రా కదిలి రా’ బహిరంగ సభలో పాల్గొన్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఎగురవేస్తున్న దృశ్యం.
గుడివాడలో జరిగిన బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్న నారా చంద్రబాబు నాయుడు..
గుడివాడలో జరిగిన ‘రా కదిలి రా’ బహిరంగ సభకు విచ్చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు అభివాదం తెలుపుతున్న నారా చంద్రబాబు నాయుడు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రమాలికతో కూడిన క్యాల్యండర్‌ను చంద్రబాబుకు అందజేస్తున్న టీడీపీ శ్రేణులు..
‘రా కదిలి రా’ బహిరంగ సభలో జగనన్నే మా భవిష్యత్ నాశనం చేసిందంటూ అమరావతి మహిళా రైతులు ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్న దృశ్యం.
గుడివాడ, మల్లాయిపాలెం వద్ద జరిగిన ‘రా కదిలిరా’ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలు..
‘రా కదిలిరా’ సభా వేదికపై నారా చంద్రబాబు నాయుడుతోపాటు నిలుచున్న పలువురు టీడీపీ నేతలు..
గుడివాడలో జరిగిన బహిరంగ సభకు చంద్రబాబు రావడంతో టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా పార్టీ జెండాలతో ఈలలు, కేకలు, నినాదాలు చేస్తున్న దృశ్యం.
Updated Date - Jan 19 , 2024 | 11:55 AM