ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

NRI: గల్ఫ్ మృతుల కుటుంబాలకు రేవంత్ సర్కార్ 5 లక్షల ఆర్థిక సహాయం

ABN, Publish Date - Mar 16 , 2024 | 09:22 PM

గల్ఫ్ దేశాలలోని ప్రవాసీ కార్మికుల చిరకాల వాంఛ అయిన మృతులకు నష్టపరిహారం చెల్లించే దిశగా ముఖ్యమంత్రి ఎ. రేవంతర్ రెడ్డి శర వేగంగా స్పందించారు.

  • గల్ఫ్‌లోని ప్రవాసీయులలో హర్షాతిరేకాలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గల్ఫ్ దేశాలలోని (Gulf Countries) ప్రవాసీ కార్మికుల చిరకాల వాంఛ అయిన ‘మృతుల కుటుంబాలకు నష్టపరిహారం’ దిశగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శరవేగంగా స్పందించారు.

సౌదీ అరేబియాలో రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ మండలానికి చెందిన శశికుమార్, బహ్రెయిన్‌లో మరణించిన కోనరావుపేట మండలానికి చెందిన బాబు కుటుంబాలకు తలా 5 లక్షల రూపాయాల చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెల్లిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Indian Origin Couple: కెనడాలో భారత సంతతి ఫ్యామిలీ మృతి.. అనుమానాస్పదంగా కేసు, ప్రమాదమేనా?

గల్ఫ్‌లో మరణించిన ప్రవాసీయుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలంటూ గత దశాబ్ద కాలంగా ప్రవాసీయులు కోరుతున్నారు. ఈ విషయమై ఇటీవల ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయానికి సంబంధించి విధి విధానాలపై ముఖ్యమంత్రి కార్యదర్శి షానావజ్ ఖాసీం కసరత్తు కూడా చేస్తున్నారు.


దుబాయి, బొగ్గుబాయి, బొంబాయి బతుకులేనంటూ ఉద్యమ కాలంలో నినదించిన కేసిఆర్ గల్ఫ్ ప్రవాసీయులను పూర్తిగా విస్మరించగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఈ విషయంలో తన చిత్తశుద్ధి నిరూపించుకొందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. బతుకమ్మ ఉత్సవాలకు ప్రవాసీయులను వాడుకొని భారాస వదిలివేయగా కాంగ్రెస్ మాత్రం అక్కున చేర్చుకొందని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి నిర్ణయంపై గల్ఫ్ దేశాలలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. దుబాయిలో కాంగ్రెస్ శ్రేణులు యస్.వి.రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రి చిత్రానికి క్షీరాభిషేకం చేయగా, త్వరలో గల్ఫ్‌లో కృతజ్ఞత సభలు నిర్వహిస్తామని పీసీసీ గల్ఫ్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి వెల్లడించారు.

మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 16 , 2024 | 09:31 PM

Advertising
Advertising