ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Health Problems : అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు, సంకేతాలు ఎలా ఉంటాయంటే..!

ABN, Publish Date - May 08 , 2024 | 01:26 PM

ఈ మధ్యకాలంలో జరిగిన విషయాలే అయినా మరుపుకు రాకపోవడం, ముఖ్యమైన తీదీలు, సమాచారం మరిచిపోవడం జరుగుతుంది. అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది.

Health Problems

అల్జీమర్స్ వ్యాధి (Alzheimers disease) మొదటిగా గుర్తించే సమస్యలలో ముఖ్యమైనది జ్ఞాపకశక్తి సమస్య. ఏదైనా విషయాన్ని గుర్తుచేసుకోవడానికి పదే పదే ప్రయత్నించడంతో ఈ అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు బయటపడుతున్నట్టు. గుర్తు తెచ్చుకోవడంలో, ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి.

జ్ఞాపకశక్తి సమస్యలు ఉన్నవారిలో అల్జీమర్స్ ఉన్నట్లే..

ఈ మధ్యకాలంలో జరిగిన విషయాలే అయినా మరుపుకు రాకపోవడం, ముఖ్యమైన తీదీలు, సమాచారం మరిచిపోవడం జరుగుతుంది. అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎందుకంటే అల్జీమర్స్ లో మెదడు లోని మొదటి భాగాలలో దెబ్బతిన్నది హిప్పోకాంపస్, ఇది జ్ఞాపకశక్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మామూలుగా ఎవరూ తన జీవితంలో జరిగిన చాలా విషయాలను మరిచిపోవడం జరుగదు. ఎన్నేళ్ళయినా జ్ఞాపకాలు చెరిగిపోవడం అంటూ ఉండదు. కానీ అల్జీమర్స్ వ్యాధికి ప్రభావితమైతే మాత్రం జ్ఞాపకాలు చెదిరిపోయే ప్రమాదం ఉంటుంది. ఆలోచనలో మార్పుల కారణంగా చాలా వరకూ ఇబ్బందులు ఉంటాయి. సొంతవారినే గుర్తుపెట్టలేకపోవడం. మాటల్లో తడబాటు, ప్రతి విషయాన్ని ఆలోచించే విధానంలో నెమ్మదితనం ఉంటాయి. మాటల్లో చెప్పాలనుకునే విషయానికి సంబంధించి పదాలను వెతుక్కుంటూ ఉంటారు.

ఆలోచించడంలో..

ఏదైనా ఆలోచించడం, వివరించడం కష్టంగా ఉంటుంది. ఏకాగ్రత కష్టంగా ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో వేరే జీవితాన్ని జీవిస్తున్నారనే భ్రమలో కూడా ఉంటారు.


Hearth Health : గుండె నొప్పిని ముందుగానే తెలిపే లక్షణాలు ఎలా ఉంటాయంటే..!

భాష పరంగా కూడా ఇబ్బందులు ఉంటాయి.

అల్జీమర్స్ వ్యాధి ప్రారంభంలో భాష పరంగా పదాలను గురించి వెతుక్కుంటూ, తడబడుతూ ఉంటారు.

మూడ్‌లో మార్పులు ఉంటాయి.

అల్జీమర్స్ వ్యాధి ప్రారంభ దశల్లో ఆత్రుతగా, చికాకుగా, విచారంగా ఉంటారు. చాలా మంది నలుగురితో కలిసి గడిపే కార్యక్రమాల్లో కలవలేకపోతారు.

కాలక్రమేణా మూడ్స్ లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. రోజువారీ పనులు కూడా కష్టంగా మారతాయి. చిత్తవైకల్యంతో జీవించడం వల్ల జీవితం సవాలుగా మారుతుంది. అల్జీమర్స్ ఉన్న వారు దూరాలను అంచనా వేయడంలో, వస్తువుల రూపరేఖలను గర్తించడంలో కష్టపడతారు.


Protein Food : రోజువారి ఆహారంలో ప్రోటీన్ ఫుడ్స్ ఎలా చేర్చుకోవాలి.. !

మెట్లను ఉపయోగించడం, కారు పార్కింగ్ వంటివి కష్టంగా మారతాయి. బిగ్గరగా సంగీతం వినడం, నలుగురితో గదిలో సమయం గడిపేందుకు కూడా అసౌకర్యాన్ని ఫీల్ అవుతారు. ఇవన్నీ అల్జీమర్స్ తొలిదశలో ఉన్న వ్యక్తుల్లో కనిపించే లక్షణాలు.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 08 , 2024 | 01:26 PM

Advertising
Advertising